
Dharmavaram
వాసవి క్లబ్ ఆసుపత్రి లో ఉచిత వైద్య సేవలు
వాసవి క్లబ్ ఆసుపత్రి లో ఉచిత వైద్య సేవలు
ధర్మవరం (పల్లె వెలుగు) సెప్టెంబర్ 10 ధర్మవరం పట్టణంలోని కాయగూరల మార్కెట్ వద్ద గల వాసవి క్లబ్ చారిటబుల్ ట్రస్ట్ ఆసుపత్రి యందు ప్రతిరోజు ఉచితంగా వైద్య సేవలను అందించడం జరుగుతుందని డాక్టర్ సంజీవిని తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గర్భవతులకు, సంతాన సాఫల్యత, గర్భకోశ వ్యాధులు నెలసరి సమస్యలను చూడబడునని తెలిపారు. చర్మవ్యాధులకు, సుఖ వ్యాధులకు, చిన్న పిల్లలకు కూడా ప్రత్యేకంగా వైద్య సేవలను అందిస్తామని తెలిపారు. చిన్నపిల్లల చర్మవ్యాధులకు సరియైన చికిత్స కూడా అందిస్తామని, అన్ని రకములైన వ్యాధులకు తగిన చికిత్సను కూడా అందిస్తామని తెలిపారు. ఇటువంటి అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.