nandyala

వాల్మీకులకిచ్చిన హామీని మరిస్తే భారిమూల్యం తప్పదు – వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి నేతలు

వాల్మీకులకిచ్చిన హామీని మరిస్తే భారిమూల్యం తప్పదు – వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి నేతలు

నంద్యాల (పల్లెవెలుగు) 11 సెప్టెంబర్: వాల్మీకుల చిరకాల కోరిక st పునరుద్ధరణ అంశం కేంద్రంతో మాట్లాడి పరిష్కరించాల్సిన ప్రభుత్వం నాన్చుడు ధోరనితో కాలయాపన చెయ్యటం మంచిది కాదని ఇప్పటికే 3 సంవత్సరాల ఆరు నెలల కాలవ్యవది అయ్యిందని అయినా కేంద్రంతో మాట్లాడే ప్రయత్నం చెయ్యక పోవటం బాధాకరమని , సంవత్సరం క్రితం అమరావతిలో వాల్మీకుల సమస్యలు విన్న ప్రభుత్వం పరిస్కారం దిశగా అడుగులు వెయ్యటం లేదని ఈ రోజు నంద్యాలలో విఆర్పీఎస్ ముఖ్యనేతల సమావేశంలో నేతలు మాట్లాడుతూ ఆ రోజు రామాయణ గ్రంథ కర్త ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహాన్ని రాష్ట్ర రాజధానిలో ఏర్పాటు చేసి వాల్మీకి భవన్ ను కట్టించాలని, సచివాలయాల ద్వారా వాల్మీకి జనాభాను లెక్కించి ఆ జనాభా ఆదారంగా సంక్షేమ ఫలాలు అందివ్వాలని అందుకు తగ్గ నిధులు వాల్మీకి కార్పోరేషన్ ద్వారా ఇవ్వాలని, వాల్మీకి మహర్షి జయంతిని సెలవు దినంగా ప్రకటించి , జయంతిని అరకొర నిధులతో కాకా అధిక నిధులు కేటాయించి ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే వాల్మీకి పిల్లలకు పూర్తి సబ్సిడీ నిధులు ఇవ్వాలని కోరామని అయినా ప్రభుత్వం ఇంతవరకు ఇందులో ఒక్కటి కూడా నెరవేర్చకపోవటం దారుణమని ఇలానే ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబిస్తే రాబోవు కాలంలో గడ్డు పరిస్థితి ఎదుర్కోక తప్పదని ఈ విషయంలో ప్రభుత్వం పునరాలో సించుకోవాలని వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయ పులికొండన్న, పార్లమెంట్ న్యాయ సలహాదారులు లాయర్ సుబ్బారాయుడు, నియోజకవర్గాధ్యక్షులు మదుగోపాల్, పట్టణ యూత్ అధ్యక్షులు పరమేష్,మహానంది మండల నేతలు జయరాం, నారి, నంద్యాల పట్టణ విఆర్పీఎస్ నేతలు సూరి, నాయుడు, రవి, హరి, హనుమంతు, సుధాకర్, రమేష్, సవారీ తదితరులు విజ్ఞప్తి చేశారు

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button