Dharmavaram

వార్డు సమస్యలు పరిష్కరించడంలో అధికారులు మరింత కృషి చేపట్టాలి.. మున్సిపల్ చైర్మన్ లింగం నిర్మల

వార్డు సమస్యలు పరిష్కరించడంలో అధికారులు మరింత కృషి చేపట్టాలి.. మున్సిపల్ చైర్మన్ లింగం నిర్మల

ధర్మవరం (పల్లెవెలుగు) 30 నవంబర్: వార్డు సమస్యలు పరిష్కరించడంలో అధికారులు మరింత కృషి చేయాలని, కౌన్సిలర్లు వార్డు సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చినప్పుడు, పరిష్కరించే దిశలోనే కృషి చేసినప్పుడే సమస్యలు విజయవంతం అవుతాయని మున్సిపల్ చైర్మన్ లింగం నిర్మల పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ కౌన్సిల్ సమావేశ భవనంలో కౌన్సిల్ సమావేశమును చైర్మన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా అజెండాలోని 35 అంశాలు టేబుల్ అజెండాలోని మూడు అంశాలపై చర్చించి కౌన్సిలర్లు ఆమోదం తెలిపారు. అనంతరం వార్డు సమస్యలలో కౌన్సిలర్లు మాట్లాడుతూ ఎర్రగుంట వైయస్సార్ సర్కిల్లో స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని వెనువెంటనే స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని, పట్టణంలోని పలు వార్డుల్లో జియో కంపెనీ ఎక్కడపడితే అక్కడ గుంతలు తొగి, స్తంభాలను నాటుతున్నారని, కానీ దాని పూడ్చే విషయంలో శ్రద్ధ చూపకపోవడంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని చైర్మన్ దృష్టికి తెచ్చారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. కౌన్సిలర్ సమస్యలను కౌన్సిల్ సమావేశంలో తెలుపుతున్న కూడా అధికారుల యొక్క స్పందన సరిగాలేదని, ప్రజలకు సమస్యలు పరిష్కరించాలన్న బాధ్యత కౌన్సిలర్ల పై ఉందని పలువురు కౌన్సిల్లో తెలిపారు. ఇక టౌన్ ప్లానింగ్ విషయంలో అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని వాటిని త్వరితగతిన అరికట్టాలని వారు కోరారు. కౌన్సిల్ సమావేశం నిర్వహించినప్పుడు ఆఫీసులోని పలు విభాగాల అధికారులు ఉన్నప్పుడే, సమస్యలను చర్చించడానికి అవకాశం ఉంటుందని మరికొందరు కౌన్సిలర్లు తెలిపారు. ఇక కొన్ని రోజుల కిందట మున్సిపల్ ఉద్యోగి కృష్ణ పై కౌన్సిలర్ జెసిబి రమణ చేసిన దాడిని తాము తీవ్రంగా ఖండించామని, సెలవుల దినాల్లో కూడా మా సిబ్బంది ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. తదుపరి కౌన్సిలర్ జెసిబి రమణకు, కమిషనర్ మల్లికార్జున కు కొద్దిసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. ఓ ప్రభుత్వ ఉద్యోగిపై చేయి చేసుకోవడం, కమిషనర్ హోదాలో ఉన్న తనను ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని ఓ ప్రశ్నకు అడిగిన వాటికి కమిషనర్ సమాధానం ఇచ్చారు. తాను,తన సిబ్బంది సెలవులు అనుకోకుండా విధులు నిర్వర్తిస్తున్న, అదేపనిగా కొంతమంది కౌన్సిలర్లు కక్షకట్టడం మానుకోవాలని, కేవలం నా విధుల్లో లోపం ఉంటే సర్దుకునే గుణం నాకు ఉందని కమిషనర్ తెలిపారు. ఓ మున్సిపల్ కౌన్సిలర్ అయిన జెసిబి రమణ మున్సిపల్ ఉద్యోగి పై దాడి చేయడం, సమంజసం కాదని భవిష్యత్తులో ఇది జరగకుండా ఉండాలని జెసిబి రమణపై పోలీసులకు అధికార పూర్వకంగా ఫిర్యాదు చేయడంలో తప్పు ఏమీ లేదని కమిషనర్ తెలిపారు. పట్టణ పరిశుభ్రతలో కావలసినంత సిబ్బంది లేకపోయినా ప్రజలను దృష్టిలో ఉంచుకొని సిబ్బందిని ఏర్పాటు చేశామని, త్వరలో సిబ్బంది కొరత లేకుండా చేస్తామని కమిషనర్ తెలిపారు. తదుపరి గత కొన్ని సంవత్సరాలుగా టౌన్ ప్లానింగ్ విషయంలో కోట్లల్లో మున్సిపాలిటీకి ఆదాయం వచ్చిన విధానాన్ని ప్రొజెక్టర్ ద్వారా కౌన్సిలర్లకు కమిషనర్ వివరించారు. మున్సిపల్ ఆఫీసులో అవినీతి, లంచగొండితనం ఉంటే నా దృష్టికి తీసుకొని వస్తే తప్పక చర్యలు చేపడతారని కమిషనర్ కౌన్సిలర్లకు హామీ ఇచ్చారు. తదుపరి పెండింగ్లో ఉన్న వార్డుల సమస్యలను త్వరితగతిన కౌన్సిలర్ల యొక్క వినతిని దృష్టిలో పెట్టుకొని పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని, మున్సిపల్ కమిషనర్ కు, సంబంధిత అధికారులకు చైర్మన్ సూచించారు. తదుపరి కమిషనర్ మాట్లాడుతూ వార్డు సమస్యల్లో పరిష్కార దిశలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సలహా మేర కే పట్టణ అభివృద్ధి దిశలో తాను నిరంతరం నా విధులను కొనసాగిస్తున్నాను అని తెలిపారు. వార్డు సమస్యలు ఏమైనా ఉంటే మున్సిపల్ చైర్మన్కు గాని, కమీషనర్ గా నాకు గానీ తెలిపిన యెడల తప్పక పరిష్కరించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్లు భాగ్యలక్ష్మి, పెనుజురి నాగరాజు, కో ఆప్షన్ నెంబర్లు బూసెట్టి రామకృష్ణ, షమీం, ఇంచార్జ్ మేనేజర్ ఆనంద్, శాంట్రి ఇన్స్పెక్టర్ మహబూబ్ బాషా, మున్సిపల్ ఇంజనీర్ సత్యనారాయణ, డి ఈ వన్నూరప్ప, మున్సిపల్ సిబ్బంది తో పాటు 40 మంది వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

chiranjeevi

Chiranjeevi Reporter,Dharmavaram, Satyasai District
Back to top button