Dharmavaram

వార్డుల అభివృద్ధి మా లక్ష్యం మున్సిపల్ చైర్మన్ లింగం నిర్మల

వార్డుల అభివృద్ధి మా లక్ష్యం మున్సిపల్ చైర్మన్ లింగం నిర్మల

ధర్మవరం (పల్లె వెలుగు) సెప్టెంబర్ 23:పట్టణంలోని వార్డుల అభివృద్ధి మా లక్ష్యమని మున్సిపల్ చైర్మన్ లింగం నిర్మల పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించేందుకు, వారు ఆకస్మిక తనిఖీలను చేపట్టారు. ఇందులో భాగంగా పట్టణంలోని 28వ వార్డు ఎల్ వన్, ఎల్ టు, ఎల్ త్రీ కాలనీలలో వారు ఆకస్మిక తనిఖీలను చేపట్టారు. ఆ వార్డు ప్రజలు చైర్మన్ను ఘనంగా ఆహ్వానించి, సన్మానించారు. తదుపరి అక్కడి ప్రజలతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు నీటి కొరత, కరెంటు అవస్థలు గూర్చి విన్నవించుకున్నారు. తదుపరి వారు మాట్లాడుతూ తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని వెళ్లడం జరిగిందని తద్వారా 57 లక్షల రూపాయలతో ప్రస్తుతం పైపులైన్లను, ఏడు బోర్లను, మట్టి రోడ్లను వేయడం జరిగిందని వారు తెలిపారు. విద్యుత్తు, పైపులైన్లను పరిశీలిస్తూ మున్సిపల్ ఏఈ హరీష్ కు త్వరితగతిన పనులు పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. వార్డుల్లో కాలువ పనులు కూడా పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే మట్టి రోడ్లను కూడా వేయించడం జరిగిందని, ప్రస్తుతం 20 లైట్లు కూడా వేశామని, నీటి సమస్య లేకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే కౌన్సిలర్లు లేదా నేరుగా తనకు తెలుపుకొనవచ్చునని తెలిపారు. పట్టణ అభివృద్ధి కొరకు ఇప్పటికే ఎమ్మెల్యే ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేర్చడం జరిగిందన్నారు. అనంతరం ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు. తదుపరి ఎర్రగుంట ఎల్సికేపురంలో గల అర్బన్ హెల్త్ సెంటర్ ను పరిశీలించారు. ప్రజల ఆరోగ్యాలను కాపాడే విధంగా వైద్యులు సేవా భావంతో, విధులు కొనసాగించాలని సూచించారు. ప్రక్కనే గల వాటర్ పంపు సెంటర్ ను కూడా పరిశీలిస్తూ, అవసరమైన ప్రాంతాలకు తూచా తప్పకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని విధిగా అందించాలని తెలిపారు. అనంతరం పట్టణంలోని సమాధుల వద్ద వీధి దీపాల ఏర్పాట్లు కూడా వారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి, వార్డు ఇన్చార్జ్ సరితాల భాష ,మాజీ కౌన్సిలర్ ఉడుముల రామచంద్ర, మున్సిపల్ ఏఈ హరీష్ తదితరులు పాల్గొన్నారు.

chiranjeevi

Chiranjeevi Reporter,Dharmavaram, Satyasai District
Back to top button