nandyala

వక్ఫ్ భూముల్లో ఖబరస్తాన్, ఈద్ గా, మస్జీద్, ఉర్దూ కాలేజీ వెంటనే నిర్మించాలి

వక్ఫ్ భూముల్లో ఖబరస్తాన్, ఈద్ గా, మస్జీద్, ఉర్దూ కాలేజీ వెంటనే నిర్మించాలి

నంద్యాల రైతు నగరం వక్ఫ్ బోర్డు భూముల్లో తక్షణం, ఖబరస్థాన్, ఈద్ గా, మజీద్, ఉర్దూ కాలేజీ నిర్మించాలని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఎమ్మెల్సీ ఇసాక్ భాష, వక్ఫ్ బోర్డు అధికారులను డిమాండ్ చేసిన ఆవాజ్ జిల్లా కన్వీనర్ మస్తాన్ వలీ, ఆవాజ్ పట్టణ అధ్యక్షుడు SA బాబుల్లా, ఆవాజ్ యువ నాయకుడు సద్దాం హుస్సేన్ మరియు కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ ఖాన్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు నగరం వక్ఫ్ బోర్డు భూములు కొన్నవారు, అమ్మిన వారు ఎవరో అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు అన్నారు. ఇందులో రాజకీయ పార్టీల ప్రమేయం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కనీసం వైసీపీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, MLC, MLA లు, వక్ఫ్ బోర్డు కమిటీ అధికారులు నిజాయితీగా ఇప్పటికైనా ఉన్న భూముల్లో తక్షణం ఖబరస్తాన్, ఈద్ గా, మస్జీద్ నిర్మించాలి. వక్ఫ్ భూములు ఎవరిసొత్తూ కాదు. ఇవి మా ముస్లింలకు చెందిన వి మా హక్కుగా ఉన్న భూముల్లో బ్రతికి ఉన్న వారు నమాజు చేసుకోవడానికి,  చనిపోయినవారిని  పూడ్చడానికి, రంజాన్ బక్రీద్ వంటి పండుగలకు ఈద్గాకు వెళ్లి నమాజ్ చేసుకోవడానికి, బెన్ని కాంప్లెక్స్, కలెక్టర్ కాంప్లెక్స్, బొగ్గు లైన్, శిల్పా, వాసవి నగర్, రైతు నగర్, ఫారూఖ్ గోడౌన్ల ఏరియా, క్రాంతినగర్  వక్ఫ్ భూముల్లో  ఉన్నవారు చనిపోతే చాలా దూరంలో ఉన్న సాయిబాబా నగర్ ఖబరస్తాన్ కు రావాలి. అక్కడ కూడా స్థలాలు చాలడం లేదు. కావున ఖబరస్తాన్, ఈద్ గా, మస్జీద్, ఉర్దూ కాలేజ్ నిర్మించాలని డిమాండ్ చేస్తున్నాం. వాటి నిర్మాణానికి ఇప్పటికే భూములు ఉన్న వారు అమ్మిన వారు అందరితో, భవనాలు కాంప్లెక్స్ లో నిర్మించిన వారందరితో, కనీసం భూమి విలువ వసూలు చేసి ముస్లింలకు కావలసిన తదితర వాటిని నిర్మించవచ్చు, లేదంటే మేమే పోరాటాలు చేసి జనాల వద్దకు తిరిగి చందాలు వసూలు చేసుకుని నిర్మించుకుంటాం, ఎన్నికల సమయం వచ్చినప్పుడు అన్ని పార్టీల వారికి తగిన బుద్ధి చెబుతాం అని తెలియజేశారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button