
లాటరీ పద్ధతిలో అర్హులైన వారికి ఇంటి పట్టాలు
లాటరీ పద్ధతిలో అర్హులైన వారికి ఇంటి పట్టాలు
ధర్మవరం (పల్లె వెలుగు) 11 నవంబర్: నవరత్నాలు పేదలకు ఇల్లు 90 రోజుల ఇంటి పట్టాల పథకంలో భాగంగా బుధవారం సాయంత్రం ఆర్డీవో కార్యాలయంలో ఆర్డిఓ తిప్పే నాయక్ సమక్షంలో లాటరీ పద్ధతిన ఇంటి పట్టాలను ఎంపిక చేయడం జరిగిందని ఆర్డీవో తిప్పే నాయక్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున తహసిల్దార్ నీలకంఠారెడ్డిలు తెలిపారు. ఈ సందర్భంగా ల్యాప్టాప్ ఆధారంగా చేసుకొని లాటరీని అధికారులు నిర్వహించారు. తదుపరి అధికారులు మాట్లాడుతూ మొత్తం 762 ఇంటి పట్టాలను లాటరీ పద్ధతి ద్వారా త్వరలో స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేతులమీదుగా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. గతంలో రోడ్డు డివైడింగ్, రైల్వే డబుల్ లింక్ వైటింగ్ లో 135 మంది, కోర్టు కేసులో అర్హులైన 45 మంది, మిగిలిన వారు 90 రోజుల ఇంటి పథకంలో ఉన్నారని తెలిపారు. చట్ట ప్రకారంగా లాటరీ పద్ధతి నిర్వహించి అర్హులైన పేద ప్రజలందరికీ కూడా ఇంటి పట్టాలను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.