
kurnool
రోడ్డు ప్రమాదం లో మోటార్ సైకిలిస్టు మృతి
రోడ్డు ప్రమాదం లో మోటార్ సైకిలిస్టు మృతి
పత్తికొండ (పల్లెవేలుగు) 20 జనవరి: మండల పరిధిలోగల పెండ్లి మాన్ తాండ గ్రామ బస్టాప్ సమీపంలో ఈరోజు 20వ తేదీ శుక్రవారం ఉదయం ఆర్టీసీ బస్సును ఢీకొని మోటార్ సైకిలిస్ట్ గోవిందు నాయక్ అక్కడికక్కడే మృతి చెందారు. గోవిందు నాయక్ మర్రిమాను తాండా గ్రామానికి చెందినవారు. నాయక్ కు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. గోవిందు నాయక్ డోన్ పట్టణంలో కోళ్ల ఫారం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. డోన్ పట్టణం నుండి స్వగ్రామం ఎం.ఎం. తండాకు వస్తుండగా రోడ్ యాక్సిడెంట్ లో మృతి చెందారు. ఎం.ఎం.తాండ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసుల కేసు దర్యాప్తు చేస్తున్నారు.