
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 160 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 160 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు
ధర్మవరం (పల్లె వెలుగు) ధర్మవరం పట్టణంలోని కోట మున్సిపల్ పాఠశాలలో ఈనెల 14వ తేదీన నిర్వహించబడిన ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరం ను రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగింది. ఇందులో 160 మంది కంటి ఆపరేషన్లకు ఎంపిక కాగా, వారందరికీ వివిధ రకాల పరీక్షలను నిర్వహించి, మూడు దఫాలుగా 160 మందిని ధర్మవరం నుంచి మూడు బస్సులను బెంగళూరు శంకర కంటి ఆసుపత్రికి తరలించడం జరిగిందని క్లబ్బు అధ్యక్షులు కృష్ణమూర్తి,ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి ,కార్యదర్శి రామకృష్ణ, కోశాధికారి జయసింహ తెలిపారు. వారు మాట్లాడుతూ ఇప్పటికే దేశ స్థాయిలో రోటరీ క్లబ్ చేస్తున్న సేవలను ప్రభుత్వం ద్వారా మంచి గుర్తింపు పొందడం జరిగిందని, పేద ప్రజలకు వివిధ రకాల సేవలను ఎల్లప్పుడూ క్లబ్బు అందజేస్తుందని తెలిపారు. కంటి ఆపరేషన్కు ఎంపికైన వారందరికీ ఉచిత వసతి, భోజనము, కంటి అద్దాలు కూడా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రతినెల జరిగే కంటి ఆపరేషన్కు రవాణా సౌకర్యమును కీర్తిశేషులు కె. ఉలక్కిరెడ్డి కుమారుడు కె. రామచంద్రారెడ్డి అండ్ మిత్రులు వ్యవహరించడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, కృతజ్ఞతలను తెలియజేశారు.