
రొమ్ము క్యాన్సర్ పై మహిళలకు అవగాహన పెంచాలి గైనకాలజిస్ట్ డా కార్తికి
రొమ్ము క్యాన్సర్ పై మహిళలకు అవగాహన పెంచాలి గైనకాలజిస్ట్ డా కార్తికి
నంద్యాల (పల్లెవేలుగు) 31అక్టోబర్: మండలం లోని శాంతిరమ్ హాస్పిటల్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశం లో శాంతి రాం ఆసుపత్రి గైనకాలజి విభాగం డాక్టర్ కార్తికి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకాల క్యాన్సర్ కంటే రొమ్ము క్యాన్సర్ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయని తెలిపారు. అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 31 రొమ్ము క్యాన్సర్ అవగాహన నెల గా మన దేశం పాటిస్తున్న నేపథ్యంలో శాంతి రాం ఫార్మసీ కళాశాల లో డాక్టర్ కార్తికి రొమ్ము క్యాన్సర్ పై మహిళలలో అవగాహన కార్యక్రమం పాల్గొని ప్రసంగించారు. మహిళల్లో వారికి తెలియకుండానే ప్రతి ఎనిమిది మంది లో ఒకరికి రొమ్ము క్యాన్సర్ వస్తోందని తెలిపారు. చాలా మందికి వృద్ధాప్యంలో క్యాన్సర్ వస్తోందని అనుకుంటున్నారని. కానీ ఈ రొమ్ము క్యాన్సర్ యువతులలో ఎక్కువగా వస్తుందని చెప్పారు. రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తే మరణాలు తగ్గించవచ్చని పేర్కొన్నారు. అలాగే మగవారికి కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని అన్నారు.