Dharmavaram

రైల్వే స్టేషన్లో ఉయ్యాల ఏర్పాటు

రైల్వే స్టేషన్లో ఉయ్యాల ఏర్పాటు

ధర్మవరం (పల్లెవెలుగు) 23 నవంబర్: పట్టణంలోని రైల్వే స్టేషన్లో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం అభాగ్యుల కొరకు ఏర్పాటుచేసిన అభాగ్యులకు అమ్మ ఒడి ఉయ్యాల అనే కార్యక్రమంలో భాగంగా బుధవారం అక్కడ ఉయ్యాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సిడిపిఓ లక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహిళలకు ఈ ఉయ్యాల ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ ఉయ్యాల కార్యక్రమమును ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమ ఉద్దేశమును తెలుపుతూ.. వద్దనుకున్నా, వదిలించుకోవాలనుచున్న పిల్లలను, రోడ్డుపక్క, కంప చెట్లలో పడవేయకుండా, క్షేమంగా ఉయ్యాల యందు బిడ్డను ఉంచవలెనని తెలిపారు. తదుపరి ఉయ్యాలలో వేసిన బిడ్డను సురక్షితమైన శిశు గృహమునందు, వసతి కల్పించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో  రైల్వే స్టేషన్ మేనేజర్ ,జిఆర్పి అండ్ ఆర్పిఎఫ్ సిఐలు, సిబ్బంది,ఐసిడిఎస్ సూపర్వైజర్స్ రాజేశ్వరి లతా కిరణ్, అంగన్వాడి టీచర్లు, హెల్పర్లు పాల్గొన్నారు.

chiranjeevi

Chiranjeevi Reporter,Dharmavaram, Satyasai District
Back to top button