Dewanakonda

రైతుల పంటలను కాపాడాలి- ఏపీ రైతుసంఘం

  • నీరు నీరు నీరు రైతు కంట నీరు చూడనఇ న చూడ రెవరు
  • హంద్రీనీవా ద్వారా  ఏప్రిల్ దాకా నీళ్లు ఇవ్వాలి.
  • రైతుల పంటలను కాపాడాలి.
  • ఏపీ రైతుసంఘం ఆధ్వర్యంలో ఎం. ఆర్. ఓ కార్యాలయం ఎదుట ధర్నా.

దెవనకొండ (ఆంధ్ర ప్రతిభ) 23 నవంబర్: శ్రీశైలం డ్యాం నందు నీటి మట్టం తగ్గుతున్నందుకు జనవరి నెల నుండి నీళ్లు ఇవ్వవబోమని హంద్రీ నీవా అధికారులు ప్రకటన ద్వారా చెప్పడం దారుణం అని రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం. జగదీష్ అన్నారు. ఈ రోజు మండల అధ్యక్ష, కార్యదర్శి లు ఇబ్రహీం, శివశంకర్ ల ఆధ్వర్యంలో ఎం.ఆర్.ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన  మాట్లాడుతూ రైతులు విత్తనాలు వేసుకోవడం  అయిపొయింది అని ఈ సమయం లో నీళ్ళు ఇవ్వమంటే వారి పరిస్థితి ఏంటో అధికారులు చెప్పాలని అన్నారు. క్వింటల్ విత్తనాలు పది వేల నుండి పదమూడు వేల వరకు ఉన్నాయని, విత్తనం విట్టడానికి కాడి కి మూడు వేలు, విత్తడానికి కూలికి ఐదు వందలు  ఖర్చు  అయ్యాయని సుమారుగా యాభై వేలు రూపాయలు పెట్టుబడి తో విత్తనం వేయడం జరిగింది అన్నారు. రైతులు వేరుశెనగ, పప్పు శనగ, జొన్న తదితర పంటలు విత్తనం వేశారు. పంటలకు  నీళ్ల అవసరం ఉన్న సమయం లో నీళ్ళు ఇవ్వమని చెబితే  రైతుకు మిగిలేది అప్పులే అన్నారు. ఖరీఫ్ సీజన్ లో ప్రకృతి కన్నెర్ర జేస్తే రైతు తీవ్రంగా నష్టపోయి, మరింత అప్పుల్లో కురుకొని పోయాడు. ఇప్పుడు అధికారులు చర్య వల్ల ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడతోంది. మరింత అప్పుల్లోకి వెళ్లే ప్రమాదం ఉన్నది. మార్చి చివరిదాకా నీళ్లు ఇవ్వాలి అప్పుడే రైతు పంట పండించే అవకాశం ఉన్నది అని అయన అన్నారు. అధికారులు తక్షణమే ప్రకటన ను వెనక్కి తీసుకోని రైతులకు న్యాయం చేయాలి. మార్చి చివర దాకా నీళ్లు ఇవ్వాలి లేని పక్షం లో రైతులను కలుపుకొని ఆందోళన నిర్వహిస్తామన్నారు.

Back to top button