Dewanakonda

రైతుల కడుపు కొట్టొద్దు

  • రైతుల కడుపు కొట్టొద్దు
  • హంద్రీనీవా ద్వారా మార్చి చివరి వరకు నీళ్లు ఇవ్వండి
  • తెలంగాణ అక్రమంగా నీటి వాడకాన్ని ఆపాలి
  • ఏపీ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు పి. రామచంద్రయ్య
  • సిపిఐ జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య
  • హంద్రీ నీవా ఎస్. ఈ రామ్ గోపాల్ వర్మకి  సిపిఐ, రైతుసంఘం వినతి.

దేవనకొండ (ఆంధ్ర ప్రతిభ) 25 నవంబర్: హంద్రీనీవ నీవా ప్రాజెక్టు ద్వారా మార్చి చివరి వరకు నీళ్లు ఇచ్చి రైతుల పంట పొలాలను కాపాడాలని ఆంధ్ర ప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి. రామచంద్రయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శిగిడ్డయ్య, ఏపీ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె. జగన్నాధం, సహాయ కార్యదర్శులు ఎం.జగదీష్, రాజా సాహెబ్, విరుపాక్షి లు కోరారు. ఈ రోజు హంద్రీ నీవా ఎస్.ఈ ని సిపిఐ, రైతుసంఘం బృందం కలసి రైతుల సమస్యలను అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా ఎస్.ఈకి వివరిస్తూ శ్రీశైలం ప్రాజెక్టు 215 టీఎంసీ ల సామర్థ్యం కు గాను ప్రస్తుతం 150 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. రాయలసీమ కు 40టీఎంసీల నీరు ఉపయోగించుకునేలా డిజైన్ చేశారన్నారు. ప్రస్తుతం 11టీఎంసీల నీరు వాడుకోవడం జరిగింది. ఇంకా 29 టీఎంసీల నీరు వాడుకునే హక్కు,అవకాశం ఉన్నదని వారు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా రోజుకు 3 టీఎంసీల నీరు వాడు కుంటున్నది శ్రీశైలం నుండి కల్వకుర్తి, పాలమూరు ప్రాజెక్టులకు అక్రమంగా తరలిస్తున్నారు. అందువల్ల నీళ్లు 30 రోజుల్లో అయిపోయే ప్రమాదం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోని రైతులకోసం తెలంగాణ అక్రమ నీటి వాడకాన్ని అడ్డుకొని కరువు సీమకు న్యాయం చేయాలి అని వారు అన్నారు.

Back to top button