
రైతులు సబ్సిడీ వేరుశనగ విత్తనాలు సద్వినియోగం చేసుకోవాలి.మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు మురళీమోహన్ రెడ్డి
రైతులు సబ్సిడీ వేరుశనగ విత్తనాలు సద్వినియోగం చేసుకోవాలి.మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు మురళీమోహన్ రెడ్డి
కోసిగి మండల పరిధిలోని రైతులు సబ్సిడీ వేరుశనగ విత్తనాలు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు మురళీమోహన్ రెడ్డి కోరారు. సోమవారం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు మండల కేంద్రము కోసిగిలోని మండల పరిషత్ కార్యాలయఆవరణలో మండల వ్యవసాయ అధికారి రాజు అద్వరంలో ఏర్పాటు చేసిన సబ్సిడీ వేరుశనగ విత్తనాలు పంపిణీ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా మురళీ రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్బం గా ఆయన మాట్లాడుతూ,రబీ సీజన్ గాను మన మండలంకు 180 క్వింటాళ్లు మంజూరు కాగా,ప్రస్తుతానికి 104 క్వింటాళ్ళు రావడం జరిగిందని, 30 కేజీల బస్తా ధర 1545 అని,కావాలసిన రైతులు ముందుగా రైతు భరోసా కేంద్రము నందు డబ్బులు చెల్లించిన అనంతరం ప్రతి రైతుకు 3బస్తాల వరకు ఇవ్వడం జరుగుతుందని, కావున రైతులందరూ సబ్సిడీ విత్తనాల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు కోరారు.అనంతరం మంజూరైన రైతులకు సబ్సిడీ వేరుశనగ విత్తనాలు పంపిణీ చేశారు.ఈకార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు నాడిగేని నరసింహులు, యంపీపీ ఈరన్న,వ్యవసాయ సలహా మండలి ఉపాధ్యక్షులు బెట్టన్నగౌడ్,సహాకార సంఘం అధ్యక్షులు మహాంతేష్ స్వామి, మాణిక్యరాజు,హోళగుంద కోసిగయ్య,మండలి సభ్యులు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.