nandyala

రైతులను చైతన్యవంతం చేయాలి ఎంపీ పోచా బ్రంహానంద రెడ్డి

రైతులను చైతన్యవంతం చేయాలి ఎంపీ పోచా బ్రంహానంద రెడ్డి

నంద్యాల (పల్లెవెలుగు)  సెప్టెంబర్ 11: ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ లో రైతులను చైతన్యవంతం చేయాలని నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని ఆర్ ఏ ఆర్  యస్ సెంటినరీ హాల్లో ఆదివారం జరిగిన ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ తరపున అవగాహన సదస్సు జరిగింది. ఈ సమావేశానికి ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ కల్లూరి రామలింగారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ జిల్లాల్లో ప్రధానంగా నంద్యాల జిల్లాలో పండ్ల తోటలు అభివృద్ధికి ఎంతో అవకాశం ఉందని పండించిన పళ్ళను కూరగాయలను నిల్వ చేయడానికి ప్రాసెసింగ్ చేయడానికి తగిన శిక్షణ రైతులకు ఇచ్చి చైతన్య వంతం చేస్తే  ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ లో ఎవరు సబ్సిడీ ఉపయోగించుకోలేదు. రైతులను ఫెడరేషన్ చైతన్యవంతం చేయాలి. ఏదైనా పరిశ్రమ నెలకొల్పితే సబ్సిడీ ఎంత వస్తుందని అడుగుతారు కానీ ఇండస్ట్రీ విజయవంతంగా నడవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే గోదాములు సమృద్ధిగా ఉన్నాయని అన్నారు. కేవలం రైతులను చైతన్యవంతం చేస్తే ఎంతో అభివృద్ధి దిశగా అడుగులు వేసే అవకాశం ఉందన్నారు.

 

ఈ సమావేశంలో ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ అవగాహన సదస్సు వల్ల ఎన్నో విషయాలు తెలుసుకున్నామని అన్నారు. ఇలాంటి సదస్సులు తరచూ నిర్వహిస్తే ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రైతుల కోసం ప్రభుత్వం తరఫున తాము ఎంతైనా పోరాటం చేస్తామన్నారు.

 

అనంతరం ఎమ్మెల్సీ ఇసాక్ భాషా మాట్లాడుతూ మామిడి,అరటి రైతులతో సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆక్వా పరిశ్రమ అభివృద్ధి కి కూడా ఈ ప్రాంతంలో ఎంతో అవకాశం ఉందన్నారు ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ అధికారి భరత్ మాట్లాడుతూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు  ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం మూడు వేల కోట్లు తో అంచనాలు తయారు చేసిందని అన్నారు. ఏదైనా పరిశ్రమ నెలకొల్పితే 300 రోజులు తప్పనిసరిగా నడిపేలా ప్రణాళిక రూపొందించుకోవాల్సింది ఉంటుందన్నారు. తాము ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న యూనిట్లు రెండు వందల కిలోమీటర్ల పరిధిలోని రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పి ఎం పి ఎస్ ఎఫ్ కింద యూనిట్లు ఏర్పాటు చేసే వారికి 35 శాతం సబ్సిడీని ప్రభుత్వం అందజేస్తుందని అన్నారు. ఈ సమావేశంలో పి.ఎం.పి.ఎస్.ఎఫ్ ప్రతినిధి సుభాష్ మాట్లాడుతూ మైక్రో యూనిట్లు ఏర్పాటు చేయడానికి ఒక కోటి రూపాయల రుణం ఇప్పించి అందులో 10% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 630 యూనిట్లు ఏర్పాటు చేశామన్నారు. అనంతరం ఏపీ ఫ్రూట్ ప్రోసెసింగ్ సొసైటీ సీఈవో శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ 25 పార్లమెంటు నియోజకవర్గం యూనిట్లు ఏర్పాటు చేయడానికి వెయ్యి కోట్ల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు. కర్నూలు జిల్లా ప్యాపిలి లో 160 కోట్లతో ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భాస్కర్ రావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమల సమస్యల పరిష్కారానికి అన్నారు. తమ అసోసియేషన్ తరపున ఎన్నో సమస్యలు ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు.

 

ప్రెసిడెంట్ కల్లూరి రామలింగారెడ్డి మాట్లాడుతూ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి ఎంతో ప్రాధాన్యత ఉందని అన్నారు. ఈ రంగంలో అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం సహకరించాలన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించాలన్నారు. రైతులను తమ సంస్థ తరఫున ఎప్పటికప్పుడు చైతన్యం చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ కార్యదర్శి వంశీకృష్ణ, మిల్లెట్స్ రామసుబ్బారెడ్డి, చిత్తూరు జిల్లా పండ్ల పరిశ్రమ సమైక్య చైర్మన్ కడప జిల్లాకు చెందిన కల్లూరు రఘునాథరెడ్డి, నంద్యాల పట్టణానికి చెందిన పారిశ్రామికవేత్త సజ్జల శ్రీకాంత్ రెడ్డి, సుబ్బారావు  ఆర్ వి సుబ్బారెడ్డి, సత్యనారాయణ తిమ్మాపురం భక్త శేషారెడ్డి లు పాల్గోన్నారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button