
రైతులకు దశల వారిగా నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చిన హంద్రీనివా అధికారులుకు ధన్యవాదాలు ఏపీ రైతు సంఘం
రైతులకు దశల వారిగా నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చిన హంద్రీనివా అధికారులుకు ధన్యవాదాలు ఏపీ రైతు సంఘం
దేవనకొండ (పల్లెవేలుగు) రైతులకు రబీ నందు కూడా దశల వారిగా సాధ్యమైనంత గా నీళ్లు ఇస్తామని తెలియజేసిన హంద్రీ నీవా అధికారులు కు, అధికారులు తో రైతుల పక్షాన కలసి మాట్లాడిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, లకు ఏపీ రైతుసంఘం జిల్లా కార్యదర్శి జగన్నాధం దేవనకొండ మండల రైతులు మరియు రైతుసంఘం తరుపున రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జగదీష్, మండల కార్యదర్శి శివశంకర్, సహాయ కార్యదర్శి రాజులు ధన్యవాదములు తెలియజేశారు. సందర్బంగా మాట్లాడుతూ రబీ సీజన్ నందు మండలం లో వేల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు. అయితే డిసెంబర్ చివరి వరకు నీళ్లు ఇస్తామని హంద్రీ నీవా అధికారులు ప్రకటించడం జరిగింది. సమయం లో రైతులు తీవ్రంగా ఆందోళన చెందారు. ఈ సందర్బం లో ఏపీ రైతుసంఘం రైతులు తరుపున రైతుల పంట పొలాలు పరిశీలించి, ప్రభుత్వ కార్యాలయాలు ఎదుట ఆందోళన లు చేపట్టడం జరిగింది. అనంతరం జిల్లా హంద్రీనివా అధికారి కి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామచంద్రయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, రైతుసంఘం జిల్లా కార్యదర్శి జగన్నాధం ఆధ్వర్యంలో సిపిఐ, ఏపీ రైతుసంఘం ప్రతినిధి బృందం కలసి అధికారులు కు రైతు సమస్యలు వివరిస్తూ రైతులు ఖరీఫ్ సీజన్ లో తీవ్రంగా నష్టపోయారు.