
రైతుకు రొక్కం భూమికి జీవం : ప్రకృతి వ్యవసాయం
రైతుకు రొక్కం భూమికి జీవం : ప్రకృతి వ్యవసాయం
కోసిగి (పల్లెవేలుగు) 15 డిసెంబర్: వేరుశనగ పంటలో లద్దె పురుగు, ఆకుముడత, కాండంతొలచు పురుగు నివారణకు ఎల్లిపాయలు పచ్చిమిర్చితో మిశ్రమాన్ని తయారుచేసి పంటపై పిచికారి చేసుకోవడం వల్ల వేరుశనగ పంట ఆరోగ్యంగానూ భూమి కూడా సారవంతంగా తయారవుతుందని మండల రీసెర్చ్ పర్సన్ పెద్ద రంగస్వామి తెలియజేశారు. ప్రకృతి మనం ఇచ్చిన దానికి వడ్డీతో సహా చెల్లిస్తుందని పొలాలపై మనం విష పదార్థాలైన రసాయనాలు పిచికారి చేసుకోవడం వల్ల విష ప్రభావం కలిగిన పంటలను మనం పొందుతున్నామని దీని ద్వారా మనిషి రోగాలపాలై ఆయుష్ తగ్గి పోవడం జరుగుతుందని, కాబట్టి రైతులు విష పదార్థాలు కలిగిన రసాయనాలకు దూరంగా ఉండి భూమిని వేప గింజల కషాయం, ఆవు మూత్రం, నీమాస్త్రం వంటి ప్రకృతి కషాయాలతో భూమిని సారవంతం చేసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన పంటలను పొందవచ్చని అన్నారు. ఈ సందర్భంగా వేరుశెనగపై లద్దె పురుగు, కాండం తొలుచుపురుగు, ఆకు ముడత వంటి రోగాలు నివారణకు ఎల్లిపాయలు పచ్చిమిర్చితో మిశ్రమాన్ని తయారు చేసే విధానాన్ని రైతుల సమక్షంలో తయారు చేసి చూపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల రీసెర్చ్ పర్సన్ పెద్ద రంగస్వామితోపాటు మండల యాంకర్ జేపీ స్వామి పాల్గొన్నారు.