
Allagadda
రేషన్ సక్రమంగా పంపిణీ చేయాలి.. ఎమ్మార్వో
రేషన్ సక్రమంగా పంపిణీ చేయాలి.. ఎమ్మార్వో
ఆళ్లగడ్డ (పల్లెవేలుగు) 10 జనవరి: పట్టణ గ్రామీన ప్రాంతాల్లో రేషన్ సక్రమంగా పంపిణీ చేయాలని తహసీల్దార్ హరినాథరావు సోమవారం ఎండియు అపరేటర్లకు సూచించారు. ఎండీయూ ఆపరేటర్లు ఉచితంగా బియ్యాన్ని కార్డుదారులకు అందించాలని అన్నారు. గతంలో బియ్యం పొందాలంటే డబ్బులు చెల్లించేవారని జనవరి నుంచి రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోందని అన్నారు. కార్డుదారుల నుంచి ఫిర్యా దులు అందితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వార పేదలకు ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని, ఈ అవకాశాన్ని కార్డుదారులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.