nandyala

రేపు హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ వారి అధ్యర్వంలో రక్తదాన శిబిరం ఏర్పాటు

*రేపు హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ వారి అధ్యర్వంలో రక్తదాన శిబిరం ఏర్పాటు*

భారతదేశ వ్యాప్తంగా హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ ఆధ్వర్యంలో “పరివర్తన్” వారోత్సవాల్లో భాగంగా గత 13 సంవత్సరాల నుండి ప్రజలకు రక్తదానాలపట్ల అవగాహన కల్పించి రక్తకోరత లేని సమాజం నిర్మించాలనే సంకల్పంలో భాగంగా హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ సర్కిల్ హెడ్ ఉమేష్ కృష్ణ, నంద్యాల బ్రాంచ్ మ్యానేజర్ రామకృష్ణ, ఆపరేషన్స్ మేనేజర్ రామకృష్ణ రెడ్డి మరియు అసిస్టెంట్ మ్యానేజర్ హుస్సేన్ బాషా కలిసి ఒక పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్కిల్ హెడ్ ఉమేష్ కృష్ణ మాట్లాడుతూ హెచ్‌.డి.ఎఫ్‌.సి బ్యాంక్ 2007 వ సంవత్సరంలో బ్లడ్ డొనేషన్ డ్రైవ్‌ను ప్రారంభించాము, ఆపరేషన్స్ హెడ్ మిస్టర్ భావేష్ జావేరి మార్గదర్శకత్వంలో దేశవ్యాప్తంగా 4 వేల పైచిలుకు యూనిట్స్ ను సేకరించి అప్పటినుండి 2019 వ సంవత్సరం వరకు మాకు కళాశాలలు, కార్పొరేట్ మరియు వివిధ సంస్థల భాగస్వామ్యంతో భారతదేశమంతటా సుమారుగా 4 లక్షల యూనిట్స్ ని సేకరించాము, కరోనా ఆటంకం వల్ల గత 2 సంవత్సరాలు చేయలేకపోయాము, తరువాత మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము, ఈ సంవత్సరం ఇది 14 వ సంవత్సరం అవుతుంది. అలాగే సమాజంలో రక్తం యొక్క అవసరం పెరిగినందున ఇంకా మెరుగ్గా పనిచేసి ఎక్కువ రక్తం యూనిట్స్ ను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము తద్వారా ప్రతి వ్యక్తికి మరియు సిబ్బందికి రక్తదానం పట్ల అవగాహన పెంపొందించడానికి మరియు రక్త అవసరాన్ని తగ్గించ్చడానికి ఒక బాధ్యతగా తీసుకుంటున్నామని తెలియజేసారు. ఈ నెల 9-12-2022 వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కర్నూలు మౌర్య ఇన్ కాంప్లెక్స్ నందు మరియు నంద్యాల ఎన్.కె.రోడ్, శోభ హోటల్ ప్రక్కన ఉన్న హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ బ్రాంచ్ లలో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని, ఈ రక్తదాన శిబిరాలలో ప్రతిఒక్కరు విరివిగా పాల్గొని స్వచ్ఛందంగా మీ అమూల్యమైన రక్తాన్ని దానం చేయాలని అలాగే మేము చేస్తున్న ఈ మంచి కార్యక్రమంలో మీరందరు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రక్తదానం చేయాలనుకున్న వారు దయచేసి ఈ క్రింది నెంబర్లకు సంప్రదించండి.
సెల్ : 9949740337, 8688813153

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button