Ntr

రూట రాష్ట్ర నూతన అధ్యక్షులుగా ఇమామ్ బాషా ఎన్నిక

రూట రాష్ట్ర నూతన అధ్యక్షులుగా ఇమామ్ బాషా

విజయవాడ, అజిత్ సింగ్ నగర్: విజయవాడ 59వ డివిజన్ లోని ఎమ్.కే. బేగ్ మునిసిపల్ కార్పొరేషన్ ఎలిమెంటరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు లయన్ ఇమామ్ బాషా  రూట (రాష్ట్ర ఉర్దూ టీచర్స్ అసోసియేషన్) రాష్ట్ర నూతన అధ్యక్షులుగా (ప్రెసిడెంట్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం కడప మద్రాస్ రోడ్ లోని షాహీ దర్బార్ ఫంక్షన్ హాల్ నందు రూట జిల్లాల ప్రతినిధులు పాల్గొని ప్రస్తుత అధ్యక్షులు డాక్టర్ అబ్దుల్ వారిస్ అధ్యక్షత న జరిగిన సమావేశం లో రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.ఎన్నిక అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి ఎస్. బి. అంజద్ బాషా ను కలిసినారు. రాష్ట్ర అధ్యక్షులు ఇమామ్ బాషా ను, మీ ఆధ్వర్యంలో రూట బలపడాలని, ఉర్దూ పాఠశాల ల అభివృద్ధికి కృషి జరపాలని, అభినందనలు తెలిపారు. ఈ సారి కోస్తా ఆంధ్రకు రాష్ట్ర కార్యవర్గం లో పెద్ద పీట వేశారని ఇమామ్ బాషా చెప్పారు. అబ్దుల్ మునాఫ్, సయ్యద్ ముష్టాక్ హుస్సేన్, (ఏలూరు), అసోసియేట్ ప్రెసిడెంట్ లుగా మౌలానా న్యామ తుల్లా (తూర్పు గోదావరి), షేక్ మహమ్మద్ గయాజ్, ఇస్మాయిల్ జబీ ఉల్లా (గుంటూరు), వైస్ ప్రెసిడెంట్ లుగా, అబ్దుల్ ముజీబ్ షాహీ(పల్నాడు), సయ్యద్ ముర్శలిన్ (ఏలూరు), జిలానీ బాషా (నెల్లూరు) అడిషనల్ సెక్రటరీ లుగా,  అల్తాఫ్ హుస్సేన్ ఖాన్ (ప్రకాశం), అబ్దుల్ అలీం (కృష్ణా) సెక్రెటరీ లుగా, జాన్ శైదా (గుంటూరు), ముహమ్మద్ రఫీ (ఎన్.టి.ఆర్.) మొహిద్దీన్ (అమలాపురం), అబ్దుల్ రహిమాన్ (కృష్ణా) అసిస్టెంట్ ఫైనాన్స్ సెక్రెటరీ లుగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి గా రూట ఫౌండర్ ప్రెసిడెంట్ సయ్యద్ హిదయతుల్లా, పరిశీలకులుగా ప్రొఫెసర్ నిసార్ అహ్మద్ వ్యవహరించారు. రెండు సంవత్సరాలు ఈ కొత్త కార్యవర్గం బాధ్యతలు నిర్వహిస్తారని ఇమామ్ బాషా తెలిపారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button