
రూట మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం రాష్ట్ర కన్వీనర్ గా జాని బాషా
రూట మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం రాష్ట్ర కన్వీనర్ గా జాని బాషా
నంద్యాల రాష్ట్ర ఉర్దూ టీచర్స్ అసోసియేషన్, ఆంధ్ర ప్రదేశ్ ( రూట, ఏపి ) రాష్ట్ర మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం రాష్ట్ర కన్వీనర్ గా నంద్యాల పట్టణం వైఎస్ఆర్ నగర్ లోని పురపాలక ఉర్దూ ఉపాధ్యాయులు జాని బాషా ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని రూట రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు లయన్ ఇమామ్ బాషా , సయ్యద్ ఇక్బాల్ తెలిపారు. జాని బాషా వివిధ హోదాలలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి , సంఘ బలోపేతానికి కృషి చేస్తున్నారని ఆయన సేవలకు గుర్తిస్తూ ఎన్నుకున్నామని వారు తెలిపారు. జాని బాషా మాట్లాడుతూ తన ఎన్నిక కు సహకరించిన రూట రాష్ట్ర నాయకత్వానికి, నంద్యాల జిల్లా శాఖ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమన్వయకర్త ముహమ్మద్ అయ్యుబ్, రాష్ట్ర నాయకులు అబ్దుర్ రఖీబ్, కలీం, అహ్మద్ హుసేన్, ఏహ్సానుల్లా ఖాన్, జబీవుల్లా , సైఫుల్లా, రూట నంద్యాల జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జమాన్, దస్తగీర్ బాషా, వర్కింగ్ ప్రెసిడెంట్ జక్రియ అలీ ఖాన్, ఆర్థిక కార్యదర్శి మహబూబ్ బాషా, కలీముల్లా, రీజనల్ శాఖ అధ్యక్షులు హనీఫ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జమాల్, జిల్లా ఉర్దూ ఉపాధ్యాయులు జాని బాషా కు శుభాకాంక్షలు తెలిపారు.