
రూట డైరీ ఆవిష్కరించిన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
రూట డైరీ ఆవిష్కరించిన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
విజయవాడ (పల్లెవేలుగు) 20 జనవరి: రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం లోనీ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి, ఉర్దూ పాఠశాలల అభివృద్ధి కి అవిరళ కృషి చేస్తున్నదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శుక్ర వారం సూర్యారావు పేటలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర ఉర్దూ టీచర్స్ అసోసియేషన్(రూట) 2023 నూతన డైరీ లను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ , రాష్ట్ర అధ్యక్షులు లయన్ ఇమామ్ బాషా,స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ అబ్దుల్ మునాఫ్ లు ఆవిష్కరించారు. రాష్ట్రం లోని ఉర్దూ పాఠశాల ల,ఉపాధ్యాయుల సమస్యల ను గురించి మంత్రి బొత్స దృష్టికి తీసుకు వెళ్లగా,సమస్యల పరిష్కారం పై ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమం లో రాష్ట్ర అసిస్టెంట్ ఫైనాన్స్ సెక్రెటరీ ఎమ్.డి.రఫీ, ఎన్.టి.ఆర్.,కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శులు షేక్ ఇక్పాల్ పాషా, షేక్ మాలిక్, ఆర్థిక కార్యదర్శి సయ్యద్ హఫీజ్, తదితరులు పాల్గొన్నారు.