
రీ సర్వేకు రైతుల యొక్క సహకారం ఎంతో అవసరము – తహసిల్దార్ నీలకంఠారెడ్డి
రీ సర్వేకు రైతుల యొక్క సహకారం ఎంతో అవసరము – తహసిల్దార్ నీలకంఠారెడ్డి
ధర్మవరం (పల్లె వెలుగు) సెప్టెంబర్ 18: ప్రభుత్వం రీసర్వేణు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని, ఇందులో భాగంగానే ప్రతి రైతు తాను సాగు చేస్తున్న భూములు యొక్క వివరాలను తప్పనిసరిగా తెలుపుతూ, సహకారం ఇవ్వాలని తహసిల్దార్ నీలకంఠారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్యాలయంలో శనివారం వారు మాట్లాడుతూ నూరు సంవత్సరాల తర్వాత నేటి ప్రభుత్వం అత్యంత సాంకేతిక నైపుణ్యంతో ఈ రీ సర్వే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ సర్వే వల్ల రైతులకు భవిష్యత్తులో కూడా ఎంతో ఉపయోగపడుతుందని, అందుకే ఈ సర్వే కార్యక్రమం త్వరగా పూర్తి కావడానికి రెండు టీములను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ టీం సిబ్బంది వాస్తవ నివేదికల కొరకు, సాగు చేస్తున్న వాటిని రైతుల ద్వారా సేకరించి పాత సర్వే స్టోన్ ప్రకారం గుర్తించడం జరుగుతుందన్నారు. ఈ రీ సర్వే కార్యక్రమములో ప్రతి సాగుదారునికి ప్రత్యేకమైన సర్వే నంబర్ ఇస్తారని అది భవిష్యత్తులో కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. అందుకే మండల పరిధిలోని సుబ్బరావుపేట ను ఈ సర్వే కార్యక్రమానికి ఎంపిక చేయడం జరిగిందని, అక్కడి రైతులు పొలాలలో హాజరై తమ భూమి యొక్క వివరాలు సాగు చేస్తున్న వాటి సమాచారాన్ని తప్పక సిబ్బందికి అందజేయాలని తెలిపారు. రైతుల సహకారం లేకపోతే వేరే ఇతరులకు ఆ యొక్క భూమి వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రతి రైతు తమ పొలంలో సాగు చేస్తున్నటువంటి అనుభవంతో కూడిన వివరాలను సిబ్బందికి తెలియజేయాలని తెలిపారు. కావున సుబ్బరావుపేట రైతులు ఈ సర్వే కార్యక్రమం విజయవంతం కావడానికి సహాయ సహకారాలను అందించాలని వారు కోరారు.