Dharmavaram

రిటైర్డ్ ఐఏఎస్ శామ్యూల్ ఆనంద్ గారిని కలిసిన గిరిజన సంఘం నాయకులు

రిటైర్డ్ ఐఏఎస్ శామ్యూల్ ఆనంద్ గారిని కలిసిన గిరిజన సంఘం నాయకులు

ధర్మవరం (పల్లె వెలుగు) 30 నవంబర్: వాల్మీకి బోయ, బెంతూ, ఒరియా కులాలను గిరిజన జాబితాలో చేర్చితే గిరిజన జాతికి తీవ్రంగా నష్టం జరుగుతుందని, గిరిజనుల మీద చిత్తశుద్ధితో జీవో నెంబర్ 52 వెంటనే రద్దు చేయాలని, ఇప్పటికే రాజకీయంగా, ఆర్థికంగా ఎంతో బలంగా ఉన్నటువంటి వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేసే ప్రతిపాదనను విరమించుకొని గిరిజన జాతికి న్యాయం చేయాలని విజయవాడలోని ఐఏఎస్ శామ్యూల్ ఆనంద్ కార్యాలయంలో వారు కలవడం జరిగింది. గిరిజన సంఘం నాయకులు శివశంకర్ నాయక్ గిరిజనుల ఉద్యమనేత డుంగావత్ బాలాజీ నాయక్ మరియు శ్రీరామ నాయక్, ధనుంజయ నాయక్, నాగేంద్ర నాయక్, ఎరుకుల గంగాధర, ధనుంజయ నాయక్, కృష్ణా నాయక్ తదితరులు శామ్యూల్ ఆనంద్ ని కలిసి వినతి పత్రం సమర్పించి గిరిజనులకు ఎదుర్కొంటున్న సమస్యల గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఉద్యమనేత  డుంగావత్ బాలాజీ నాయక్ మాట్లాడుతూ గిరిజనుల కోసం రాజీలేని పోరాటాలు చేస్తామని, గిరిజన జాతి కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని తెలిపారు.

chiranjeevi

Chiranjeevi Reporter,Dharmavaram, Satyasai District
Back to top button