
రికార్డ్ డాన్స్ లకు అనుమతి లేదు
గడివేముల మండలంలోని అన్ని గ్రామాలలో గడివేముల ఎస్ఐ బీటీ వెంకటసుబ్బయ్య దసరా దీపావళి పండుగల సందర్భంగా ఎవ్వరు కూడా రికార్డు డాన్స్, ఆర్కెస్ట్రాలాంటి ప్రోగ్రాములు నిర్వహించరాదని అన్నారు. గతంలో ఎల్కేతాండా ప్రజలు దీపావళి పండుగ సందర్భంగా రికార్డు డ్యాన్సులు పెట్టుకునే విషయంలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగాయని, రికార్డు డాన్స్ మరియు ఆర్కెస్ట్రా వారికి అడ్వాన్సులు ఇచ్చామని వాదించిన ఎటువంటి ఉపయోగం ఉండదన్నారు.