
Dharmavaram
రాహూల్ గాంధీ ని కలిసిన రాయలసీమ ఉద్యమ నాయకులు
- రాహూల్ గాంధీ ని కలిసిన రాయలసీమ ఉద్యమ నాయకులు
- విభజన చట్టం,శ్రీబాగ్ ఒప్పందం గురించి చర్చించిన రాయలసీమ ఉద్యమ యువ నాయకులు
కర్నూల్ (పల్లెవెలుగు) అక్టోబర్ 20: రాయలసీమలోని ఆదోని-ఎమ్మిగనూర్ జరుగుతున్న భారత్ జోడో యాత్రలో భాగంగా రాయలసీమ ఉద్యమకారులు రాహుల్ గాంధీని కలవటం జరిగింది.ఈ సందర్భంగా ఆర్ విఎస్ సీమకృష్ణ,ఆర్ విపిఎస్ రవికుమార్ మాట్లాడుతూ రాయలసీమలో జరుగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగ కలిసి విభజన చట్టంలోని హామీలు రైల్వేజోన్,ఉక్కు పరిశ్రమ అదే విధంగా రాయలసీమకు బుంధేల్ ఖండ్ తరహ ప్రత్యేక ప్ర్యాకేజ్ గురించి చర్చించటం జరిగిందన్నారు.అదే విధంగా శ్రీబాగ్ ఒప్పందం గురించి చర్చించి రాయలసీమలోని కరువులు వలసలు నిరుద్యోగం రైతుల ఆత్మహత్యల గురించి చర్చించటం జరిగిందని తెలియచేసారు.ఈ కార్యక్రమంలో ఆర్ విపిఎస్ జిల్లా అధ్యక్షులు అశోక్,నల్లారెడ్డి,చంటి,బజారి తదితరులు పాల్గోన్నారు.