nandyala

రాష్ట్ర రెండో అధికార భాష ఉర్దూను అధికారికంగా అమలు కొరకు రూట వినతి

రాష్ట్ర రెండో అధికార భాష ఉర్దూను అధికారికంగా అమలు కొరకు రూట వినతి

నంద్యాల (పల్లెవేలుగు) 15 డిసెంబర్: రాష్ట్ర రెండవ అధికార భాష ఉర్దూ కు సంబంధించిన వివిధ సమస్యలపై న   రియసతీ ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు జమాన్ ఆధ్వర్యంలో రూట సభ్యులు నంద్యాల జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా రూట అధ్యక్షుడు జమాన్ మాట్లాడుతూ ఉర్దూకు సంబంధించిన సమస్యల పైన ముఖ్యంగా నంద్యాల పట్టణం లో నీ ఉర్దూ మున్సిపల్ స్కూల్లో విద్య వాలంటీర్లను  నియమించాలని మరియు ప్రతి ప్రభుత్వ కార్యాలయం లోని బోర్డులను ఉర్దూ భాషలో రాయాలని ఈ సందర్భంగా కలెక్టర్ ని విన్నవించామని వెల్లడించారు. దస్తగిరి బాషా రూట జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ ఉర్దూ అప్పర్ ప్రైమరీ   స్కూల్స్ మరియు హై స్కూల్లో సబ్జెక్టు తెలుగు భాష బోధించడం కొరకు తెలుగు టీచర్ ని వర్క్ అడ్జస్ట్మెంట్ చేయాలని మరియు ముస్లింలు అత్యధికంగా జనాభా కలిగిన ప్రాంతాల్లో ఉర్దూ అంగన్వాడి కేంద్రాన్ని స్థాపించాలని ఈ సందర్భంగా కలెక్టర్ కి విన్నవించామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రూట జిల్లా  వర్కింగ్ ప్రెసిడెంట్ జిక్రియ అలీ ఖాన్  మున్సిపల్ రాష్ట్ర కన్వీనర్ జానీ భాష మరియు నంద్యాల డివిజన్ అధ్యక్షుడు హానిఫ్ తదితరులు పాల్గొనడం జరిగింది.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button