nandyala

రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు జిల్లా బాలికల జట్టు ఎంపిక

రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు జిల్లా బాలికల జట్టు ఎంపిక

నంద్యాల (పల్లెవేలుగు) 24 డిసెంబర్: రాష్ట్రస్థాయి జూనియర్ బాలికల హ్యాండ్ బాల్  పోటీల్లో పాల్గొనే నంద్యాల జిల్లా బాలికల జట్టును శుక్రవారం ఆలగడ్డలో ఎంపిక చేశారు. ఆళ్లగడ్డలోని ఆర్ఆర్ స్పోర్ట్స్ అకాడమీ మైదానంలో ఈ ఎంపిక పోటీలు జరిగాయి. నంద్యాల జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి దాదాపు 35 మంది బాలికలు ఈ ఎంపిక పోటీల్లో పాల్గొన్నారు.జిల్లా హ్యాండ్ బాల్ సంఘం ప్రతినిధులు రాజ్ కుమార్ రెడ్డి, రామేశ్వర్ రెడ్డి ,మహబూబ్ బాషా ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. ఆర్ఆర్ స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ రామ సుబ్రమణ్యం క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో నంద్యాల జిల్లా జట్టు ప్రతిభ కనపరిచి విజయం సాధించాలన్నారు .అనంతరం క్రీడాకారిణి లను పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఆర్ స్పోర్ట్స్ క్రికెట్ అకాడమీ సెక్రెటరీ ఏవి రామసుబ్రహ్మణ్యం, అకాడమీ శిక్షకుడు సుబ్బరాయుడు,సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఎంపికైన జిల్లా జట్టు ఈనెల 30, 31 తేదీల్లో అనంతపురం జిల్లా కదిరిలో జరిగే రాష్ట్ర స్థాయి జూనియర్ బాలికల హ్యాండ్ బాల్ ఛాంపియన్షిప్లో పాల్గొంటుందని సంఘ ప్రతినిధులు తెలిపారు. జిల్లా జట్టుకు ఈనెల 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఆళ్లగడ్డ లో శిక్షణ శిబిరం నిర్వహిస్తామన్నారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button