
kosigi
రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలకు ఎంపిక
రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలకు ఎంపిక
కోసిగి. మండల పరిధిలోని సాతనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఎం.కృష్ణ అనే విద్యార్థి రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానో పాధ్యాయులు పురుషోత్తం రెడ్డి విలేకరులకు తెలిపారు. అండర్-17 క్యాటగిరిలో కడప జిల్లా ఎర్రగుంట్లలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు.మారుమూల గ్రామమైన సాతనూరు గ్రామం నుంచి క్రీడల్లో విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.