kosigi

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు కందుకూరు విద్యార్థీనులు

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు కందుకూరు విద్యార్థీనులు

కోసిగి (పల్లెవేలుగు) 30నవంబర్: రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు మండల పరిధిలోని కందుకూరు పాఠశాలలో చదువుతున్న ముగ్గురు  విద్యార్థినులు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు జాన్సన్ పీఈటి వెంకటేశ్వర్లను తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా లో జరిగిన ఎస్ జి ఎఫ్  ఖో ఖో క్రీడా పోటీలలో వివిధ తాలూక స్థాయిల నుంచి సెలెక్ట్ అయిన విద్యార్థులు సుమారుగా 900 మంది విద్యార్థులు ఖో ఖో పోటీలలో అండర్ 14 మరియు అండర్ 17 విభాగం లో పోటీ పడగా మంత్రాలయం తాలూకా స్థాయి  నుండి కందుకూరు జడ్పీహెచ్ స్కూల్ విద్యార్థీనులు అండర్ 14 విభాగంలో శివాంజలి , అండర్ 17 విభాగంలో మైత్రి లు రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం జరిగినదని , అదేవిధంగా ఆత్మకూరులో జరిగిన అసోసియేషన్ మీట్ జూనియర్ ఖో-ఖో విభాగం నుంచి విజయలక్ష్మి అనే విద్యార్థీ రాష్ట్రస్థాయికి  ఎంపికైందన్నారు.  ఎంపికైన విద్యార్థులకు తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు ఉపాధ్యాయ బృందం రామలింగం, వెంగమ్మ , శ్రీదేవి , సునీత , సుధాకర్ ,మల్లేశ్వరి , సోమేశ్వరి , నారాయణ, సుశీల లు అభినందించారు

Mohammad Yousuf

Mohammad Yousuf Reporter, Kosigi, Kurnool DIst
Back to top button