nandyala

రాయలసీమ అభివృద్ధి పై చర్చకు సిద్ధమా? ఎన్.ఎమ్.డి ఫిరోజ్

రాయలసీమ అభివృద్ధి పై చర్చకు సిద్ధమా? ఎన్.ఎమ్.డి ఫిరోజ్

 

నంద్యాల (పల్లెవేలుగు) 17 నవంబర్: సీమ అభివృద్ధి పై బహిరంగ చర్చకు సిద్ధమా?  అని వైస్సార్సీపీ నాయకులకు సవాల్ విసిరారు తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.ఎమ్.డి ఫిరోజ్. ఈ.

సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఫిరోజ్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు పర్యటన నేపధ్యంలో ప్రజల దృష్టి మళ్లించాలన్న దురుద్దేశ్యంతోనే వైసీపీ నాయకులు వికేంద్రీకరణ అంటూ మొన్న రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించడం జరిగిందని వైసీపీ నాయకులకు దమ్ముంటే ముడున్నారేళ్లలో రాయలసీమకు ఎటువంటి అభివృద్ధి చేశారో సమాధానం చెప్పాలన్నారు.

తాము కర్నూలులో హై కోర్టు ఏర్పాటుకు వ్యతిరేకం కాదని కానీ విశాఖపట్నం విజయవాడలో హై కోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం వెనుక మతలబు ఏమిటో వైసీపీ నాయకులు సమాధానం చెప్పలన్నారు. చంద్రబాబు నాయుడు రాష్టవ్య్రాప్తంగా రోడ్ షోలు బహిరంగ సభలకు వస్తున్న అశేష ప్రజాదరణ చూడలేకే వైసీపీ నాయకులు ప్రతి విషయం చంద్రబాబు మీద తోసేయడం తగదని వైసీపీ నాయకులు విమర్శలు చేసే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. గతంలో నారాచంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ అభివృద్ధిలో భాగంగా కర్నూలు జిల్లాకు అతిపెద్ద సోలార్ ప్లాంట్ ను గ్రీన్ కో కరెంట్ ప్లాంటు ను ఓర్వకల్లు కు ఎయిర్ పోర్ట్ రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీ ని అందించారని గుర్తు చేశారు అదేవిధంగా కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాకు కీయా మోటార్ ను తీసుకొచ్చి ఎంతో మంది యువకులకు జీవనాధారం చూపించిన ఘనత చంద్రబాబుదని ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి పనులు రాయలసీమకు చేశారని  నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవి నాడు  టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడును గొప్ప లీడర్ గా అభివర్ణించి నేడు పార్టీ మారి చంద్రబాబు నాయుడును విమర్శించడం తమ విజ్ఞేతకే వదిలేస్తున్నన్నారు పార్టీలు మారే సంస్కృతి తమది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పార్టీ అధికారం ఉందో ప్రతి పక్షంలో ఉందో వారి నాయకులకే తెలియడం లేదని మూడు కాకుంటే 26 రాజధానులు చేసుకోవాలని ఎద్దవా చేశారు. మీరు చేస్తున్న ప్రతి నాటకాన్ని ప్రజలు గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ప్రజలు పట్టం కట్టబోతున్నారని అదేవిధంగా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేసే వరకు ప్రతి కార్యకర్త నూతనోత్సాహం తో ముందుకు సాగాలని విజ్ఞేప్తి చేశారు

deva dattu

Devadattu Reporter Panyam
Back to top button