kurnool

రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిద్దాం

రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిద్దాం

కర్నూలు (పల్లెవేలుగు) 29 నవంబర్: రాజ్యాంగ నిర్మాణం వెనుక ఎన్నో పోరాటాలు, ఆకాంక్షలు, సామాజిక, విప్లవ అభినివేశాలు ఉన్నాయని, ఎందరో మహాత్ములు, గొప్ప వ్యక్తుల త్యాగ ఫలితాలతో 1947 ఆగస్టు 15 వ తేదీన స్వాతంత్ర్య భారతంగా అవతరించి మరో రెండేళ్ల తరువాత డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ వంటి మేధావులు మరియు మహానుభావుల కృషితో మన దేశ రాజ్యాంగం సిద్ధమైందని వక్తలు తెలిపారు. స్థానిక ఉస్మానియా డిగ్రీ కళాశాలలో  “రాజ్యాంగ దినోత్సవం” సందర్బంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు.  ఈ కార్యక్రమంలో వక్తలు డిగ్రీ  కళాశాల ప్రిన్సిపాల్ సయ్యద్ సమిఉద్దిన్ ముజమ్మిల్, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ ఏ ఎం గజని, ఎన్ ఎస్ ఎస్ కో ఆర్డినేటర్లు ఎ. అబిద్ అలీ, ఎస్. ఉబెదుల్ల షరీఫ్, వివిధ శాఖలకు చెందిన విభాగాధిపతులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది  మరియు ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కళాశాలలో NSS యూనిట్ల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వ్యాసరచన పోటీలు నిర్వహించారు.  కార్యక్రమంలో విద్యార్థులు, సిబ్బంది మరియు వాలంటీర్లతో ఎన్ ఎస్ ఎస్ కో ఆర్డినేటర్ ఎస్. ఉబెదుల్ల షరీఫ్ ప్రవేశిక ప్రతిజ్ఞ చేయించారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button