
రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పై దాడిని, అవమానాన్ని తీవ్రంగా ఖండించిన జమాఆతె ఇస్లామీ హింద్
రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పై దాడిని, అవమానాన్ని తీవ్రంగా ఖండించిన జమాఆతె ఇస్లామీ హింద్
నంద్యాల (పల్లెవేలుగు) 14 ఫెబ్రవరి: స్థానిక పట్టణంలోని బోమ్మల సత్రం సెంటర్ లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహనికి జరిగిన అవమానాన్ని, విగ్రహం ధ్వంసానికి జరిగిన కుట్రను జమాఆతె ఇస్లామీ హింద్ తీవ్రంగా ఖండిస్తుందని స్థానిక అధ్యక్షులు షేక్ అబ్దుల్ సమద్ తెలిపారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పై గౌరవం లేని దుష్టశక్తులను గుర్తించి శిక్షించాలని సమద్ డిమాండ్ చేసారు. కూత వేటు దూరంలో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఉన్న దుండగులు అంబేద్కర్ విగ్రహం ముక్కు, వేళ్ళ పై దాడికి పూనుకోవడం, విగ్రహం నిప్పు పెట్టె ప్రయత్నం చేయడం సహించరాని నేరమని ప్రశాంతంగా ఉన్న నంద్యాలలో అలజడులు తీవ్రంగా పరిగణించి దుండుగులను శిక్షించాలని , ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సమద్ సూచించారు.