రవింద్రభారతి కవి సమ్మేళనంలో కవిత వినిపించిన సమద్
రవింద్రభారతి కవి సమ్మేళనంలో కవిత వినిపించిన సమద్
నంద్యాల (పల్లెవేలుగు) 28 నవంబర్: ఆదివారం సాయంత్రం రవింద్రభారతి లో ధార్మిక జన మోర్చా తెలంగాణ వారు నిర్వహించిన కవి సమ్మేళనం లో నంద్యాల జమాఆతె ఇస్లామీ హింద్ అధ్యక్షులు మైనార్టీ నాయకులు షేక్ అబ్దుల్ సమద్ సద్భావన అంశం పై కవిత వినిపించారు. ధార్మిక జన మోర్చా సమన్వయకర్త సాదిక్ అహమ్మద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ నాళేశ్వరం శంకరం ప్రముఖ కవి అధ్యక్షులు తెలంగాణ రచయితల సంఘం, కాళారత్న బిక్కి కృష్ణ సుప్రసిద్ధ కవి, విమర్శకులు, సినీ గేయ రచయిత, అధ్యక్షులు నవ్యాంధ్ర రచయితలు సంఘం, డాక్టర్ మంగళ మక్కపాటి, కవయిత్రి, రచయిత్రి, ఫాదర్ అనంతయ్య సెక్రటరీ టీసిబీసి, ప్రమోద్ జైన్, జైన్ సేవా సంఘం, చలనానికి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఆ.ప్ర రచయితలు సంఘం రెండు తెలుగు రాష్ట్రాల నుండీ కవులు, కవయిత్రులు దూరం ప్రాంతాల నుండి వచ్చి సద్భావన, దేశ ఐక్యత పై తమ కవితలు వినిపించారు. మొహమ్మద్ అబ్దుల్ రషీద్ కన్వీనర్ గా వ్యవహరించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రపంచంలో స్తంభనలు సంభవించినపుడు ముందుగా స్పందించే వారు కళాకారులు, కావులే అన్నారు. నేడు మనదేశంలో అడుగంటుచున్న లౌకిక వ్యవస్థ లో, మతతత్వ విలయ తాండవాన్ని వెలవరిస్తు కవులు తమ కలాలను కదిలించాలని కోరారు. బిక్కి కృష్ణ సమద్ ను అభినందిస్తు త్వరలో కవితా సంపుటిని తీసుకుని రావాలని కోరారు. సమద్ తన సాహిత్యాభిలాషతో గత మూడు దశాబ్దాలుగా గీటురాయి పత్రికలో కథలం రాస్తూ, పలు పత్రికల కు కవితలు రాస్తూ పలు సంస్థలు చే పురస్కారాలు అందుకున్నారు. సమద్ మాట్లాడుతూ తన రచనలు సంపుటీగా తీసుకుని రానున్నట్లు తెలిపారు.