
రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం
- రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం
- రజక సామాజిక వర్గానికి న్యాయం చేసిన ప్రభుత్వాధికారులకు కృతజ్ఞతలు – రజక సంఘం నాయకులు జూటూరు వెంకటేశ్వర్లు
నంద్యాల (పల్లెవేలుగు) 06 డిసెంబర్ : నూతనంగా నంద్యాల జిల్లా గా ఏర్పాటు అయిన తరువాత జిల్లా మానిటరీ కమిటీ నందు రజక సామాజిక వర్గానికి చెందిన నందవరం శ్రీనివాసులును మానిటరీ కమిటీ సభ్యులుగా ఎంపిక చేసినందుకు ప్రభుత్వ అధికారులకు, రజక సంఘం నాయకులు జూటూరు వెంకటేశ్వర్లు ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు. నంద్యాల పట్టణం లోని 1వార్డు బయటిపేటలోని రజక సంఘం కార్యాలయంలో నూతనంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా నందవరం శ్రీనివాసులు ఎంపిక అయినందుకు రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సంధర్బంగా రజక సంఘం నాయకులు జూటూరు వెంకటేశ్వర్లు పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు జిల్లా మానిటరింగ్ కమిటీలో రజక సామాజిక వర్గానికి న్యాయం చేశారని, జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామున్ కు, జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు. రానున్న కాలంలో ఇంకా మరిన్ని పదవులను అలంకరించి సోదరుడు శ్రీనివాసులు రజక జాతికి మరిన్ని సేవలను అందించాలని కోరారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని, రజకులకు రక్షణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు రజకులకు తీరని అన్యాయం చేస్తున్నాయని, ప్రజా ప్రతినిధులకు కేవలం ఎన్నికల్లో మాత్రమే రజకులు గుర్తుకు వస్తారు తప్ప, రజకుల అభివృద్ది ఏమాత్రం పట్టదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు కొర్రపోలూరు నాగరాజు, వై.సుబ్రమాణ్యం, వేముల పాటి రామమద్దిలేటి, సి.వెంకటేశ్వర్లు, ఆయుర్వేదం మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.