
రజక ఎస్సీ జాబితా, రజక రక్షణ చట్టాన్ని వెంటనే ఆమలు చేయాలి – నందవరం శ్రీనివాసులు
- రజక ఎస్సీ జాబితా, రజక రక్షణ చట్టాన్ని వెంటనే ఆమలు చేయాలి – నందవరం శ్రీనివాసులు
- రజక ఎస్సీ జాబితా, రజక రక్షణ చట్టాన్ని తక్షణమే ఆమలు చేయాలని కోరుతూ మూడు రోజుల నిరాహార దీక్షలు
నంద్యాల (పల్లెవేలుగు) 01 డిసెంబర్: ఏపి రాష్ట్రంలోని రజకులు గ్రామ బహిష్కరణలు, దాడులు, రజకుల ఆస్తుల కబ్జాలు జరుగుతున్న కారణంగా ఏపి రజక ఎస్సీ సాధన సమితి ఆధ్వర్యంలో రజక ఎస్సీ జాబితా, రజక రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతూ ఈనెల 26న తాలూకా పోలీసు స్టేషన్ ఎదుట మూడు రోజుల నిరాహార దీక్షలను చేపడుతున్నట్లు ఏపి రజక ఎస్సీ సాధన చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు నందవరం శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నో ఏళ్ళ తరబడి నుండి రజకులు దోపిడీకి గురి అవుతున్నప్పటికీ రాజకీయ పార్టీలు చోద్యం చోస్తున్నాయని, కేవలం రజకుల ఓట్ల కోసం, కుల వృత్తి కోసం ధోభీ ఘాట్లు నిర్మిస్తాం, ఇస్త్రీ పెట్టెలు, ఓటుకు నోటు ను ఇచ్చి మాయ మాటలు చెప్పి ఓట్లను దండు కోవడం తప్ప ఇప్పటి వరకు ఏ ఒక్క డిమాండును నెరవేర్చలేదని ఆరోపించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రజకుల పై దాడులు, రజకుల ఆస్తుల కబ్జాలు, గ్రామ బహిష్కరణలు చేస్తున్నప్పటికీ, రాజకీయ పార్టీ నాయకులకు పోలీసు అధికారులు కొమ్ము కాస్తూ నిర్లక్ష్యంగా వ్యహరించడం దారుణమని ఆవేదన వ్యవహరించారు. అంతే కాకుండా ప్రస్తుత ప్రభుత్వము మూడున్నర సంవత్సరాల నుండి రజక జనాభ కులగణన చేపట్టక పోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం 56 కార్పొరేషన్ల ను ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పు కోవడమే తప్ప, అందులో ఏ ఒక్కరూపాయ నిధులను కేటాయించకుండా బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నారని తెలిపారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి రజకుల పై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని, రజకులకు రక్షణ చట్టాన్ని వెంటనే ఆమలు చేసి అసెంబ్లీలో మంత్రివర్గ తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరుల మద్దతుతో మూడు రోజుల నిరాహార దీక్షలను చేపడుతున్నట్లు వివరించారు. కాబట్టి నంద్యాల జిల్లాలోని అన్ని నియోజక వర్గాల నుండి భారీగా రజక సోదరులు, సోదరీమణులు అందరూ ఈ దీక్షలకు తమ సంపూర్ణ మద్దతును తెలియయాలని కోరుతున్నామని ఆన్నారు.