
రక్తదాన శిబిరం
రక్తదాన శిబిరం
ధర్మవరం (పల్లె వెలుగు) సెప్టెంబర్ 22: పట్టణములోని సాంస్కృతిక మండలి లో ఈనెల 24వ తేదీ శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రక్తదాన శిబిరమును నిర్వహిస్తున్నట్లు క్యాంపు చైర్మన్ శివయ్య ,ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గురువారం సాంస్కృతిక మండలి లో వారు రక్తదాన శిబిరానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం శివయ్య నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ రక్తదాన శిబిరము రోటరీ క్లబ్,ఏపీ వివిపి బ్లడ్ స్టోరేజ్ సెంటర్ – ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వారి సౌజన్యంతో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ముఖ్య అతిథిగా రోటరీ క్లబ్ జిల్లా గవర్నర్ ఓమ్మిన సతీష్ బాబు హాజరు కానున్నారని తెలిపారు. ఆరోగ్యవంతులు ఎవరైనా కూడా రక్తదానం చేయవచ్చునన్నారు. రక్తదానం మరొకరికి జీవితాన్ని ఇస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని తెలిపారు. ఈ శిబిరంలో బ్లడ్ గ్రూపును ఉచితంగా చూడబడుతుందన్నారు. అదేవిధంగా భవిష్యత్తులో ఎవరికైనా అత్యవసర పరిస్థితులలో రక్తం కావలసి ఉంటే లేదా ఎవరైనా రక్తం ఇవ్వాలనుకుంటే, మీ వివరాలను సెల్ నెంబర్ 9885224759 కు సమాచారాన్ని అందించాలన్నారు. నేటి నుండి రోటరీ క్లబ్ నందు రక్త దాతల పేర్లను రిజిస్ట్రేషన్ చేయబడునని తెలిపారు. ఈ రక్తదాన శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని, రక్త దాతలు కావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రమేష్ బాబు, సత్రశాల ప్రసన్నకుమార్ ,బండారు చలం, గట్టు హరినాథ్, ఉట్టి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.