
రక్తదానం మరొకరికి ప్రాణదానం అవుతుంది వన్ టౌన్ సిఐ సుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున.
రక్తదానం మరొకరికి ప్రాణదానం అవుతుంది వన్ టౌన్ సిఐ సుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున.
ధర్మవరం (పల్లెవెలుగు) అక్టోబర్ 21 : రక్తదానం మరొకరికి ప్రాణదానమవుతుందని వన్ టౌన్ సిఐ సుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎన్జీవో హోం లో శుక్రవారం ఏర్పాటుచేసిన”అమరవీరుల వారోత్సవాలు”సందర్భంగా రక్త బంధం ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు కన్నా వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరమునకు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రక్త బంధం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే వేలాదిమందికి జిల్లా వ్యాప్తంగా రక్త దాతల ద్వారా రక్తాన్ని ఇచ్చి, ఎంతోమంది ప్రాణాలను కాపాడటం పట్ల వారు రక్త బంధం ఆర్గనైజేషన్ ను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం సిఐ సుబ్రహ్మణ్యం, కమీషనర్ మల్లికార్జున తోపాటు కానిస్టేబులు, హెడ్ కానిస్టేబుల్ లు రక్తదానం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేస్తూ, మరింత గుర్తింపు తెచ్చుకోవాలని తెలిపారు. కన్నా వెంకటేష్ మాట్లాడుతూ ఈ శిబిరానికి 71 మంది రక్తదానం చేయడం జరిగిందని, ఈ రక్తాన్ని బత్తలపల్లి మండలంలో గల ఆర్డిటి ఆసుపత్రిలో నీ తల సేమియా వ్యాధిగ్రస్తులకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ సీఐ రాజా, బత్తలపల్లి సిఐ మన్సూర్ ఉద్దీన్, ఎస్ఐలు, కానిస్టేబులు, రక్త బంధం ఆర్గనైజేషన్ కమిటీ సభ్యులు పద్మావతి, జయప్రకాష్, దాసరి శివా, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.