
యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ నోటిఫికేషన్
యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ నోటిఫికేషన్
నంద్యాల (పల్లెవేలుగు) 08 నవంబర్: యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ నోటిఫికేషన్ సందర్భంగా జోనల్ రిక్రూటింగ్ ఆఫీసర్ రవిరాజు నంద్యాల పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరామ్ నంద్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ ఖాన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది ఈ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ 6వ తారీకు నుంచి 12వ తారీకు వరకు ఆన్లైన్ నామినేషన్స్ ప్రక్రియ జరుగుతుంది నవంబర్ 20వ తారీకు నుంచి డిసెంబర్ 20వ తారీకు వరకు మెంబర్షిప్ ఎలక్షన్ ప్రక్రియ మొదలవుతుంది దీనిలో యువత పాల్గొని రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర లో యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ యువత దేశ భవిష్యత్తు ను కాపాడవలసిన అవసరం చాలా ఉంది. కాంగ్రెస్ పార్టీలో యువతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నంద్యాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డాక్టర్.చింతల మోహన్ రావు, పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్య రాష్ట్ర అధికార ప్రతినిది ఉకోటు వాసు సేవ దళ్ రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ ఖాన్, బండి ఆత్మకూరు మండల అధ్యక్షుడు జజ్జన రవిబాబు యూత్ కాంగ్రెస్ నాయకులు చాంద్ బాషా, పసుపుల అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు