Dharmavaram

యువజన ఉత్సవాల్లో సత్తా చాటిన వివేకానందా డిగ్రీ కళాశాల విద్యార్థులు

యువజన ఉత్సవాల్లో సత్తా చాటిన వివేకానందా డిగ్రీ కళాశాల విద్యార్థులు

ధర్మవరం పల్లె వెలుగు ఇటీవల జరిగిన కే హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మండల సాయి యువజన ఉత్సవాలు లో వ్యక్తిత్వ, పోటీలో మొదటి స్థానాన్ని కావ్య, క్లాసికల్ సాంగ్స్ లో ద్వితీయ బహుమతి సాధించిన లహరి, అదేవిధంగా గిటారు నందు తనదైన శైలిలో ఆకట్టుకొని రెండవ బహుమతి పొందిన ప్రణవ్ అనే వివేకానంద డిగ్రీ కళాశాల విద్యార్థులు కైవసం చేసుకోవడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ రిజ్వాన్ భాషా పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు శనివారం మాట్లాడుతూ ఈనెల 13,14, 15వ తేదీలలో రాష్ట్రస్థాయిలో విజయవాడ నందు జరుగు యువజన ఉత్సవాలకు మా విద్యార్థులు ఎంపిక కావడం నిజంగా సంతోషదాయకమని తెలిపారు. చదువుతోపాటు క్రీడలు, సాంస్కృతిక రంగాలలో కూడా మా కళాశాల ఎల్లప్పుడూ ముందంజలో ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థులను ప్రిన్సిపాల్ రిజ్వాన్ భాషా తో పాటు అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, తోటి విద్యార్థులు అభినందించి హర్షం వ్యక్తం చేశారు.

chiranjeevi

Chiranjeevi Reporter,Dharmavaram, Satyasai District
Back to top button