Dharmavaram

యజమానుల నిర్లక్ష్యం-ప్రజలకు ప్రాణసంకటం

యజమానుల నిర్లక్ష్యం-ప్రజలకు ప్రాణసంకటం

  • ధర్మవరంలో వందలకొద్దీ ‘ఆవులు’ రోడ్లమీదే
  • మునిసిపల్ అధికారులు ఎన్ని నోటీసులిచ్చినా,కౌన్సిలింగ్ నిర్వహించినా మారని ‘యజమానుల తీరు

ధర్మవరం,ఆగస్టు,22;(పల్లెవెలుగు) ధర్మవరం పట్టణంలో ఏ సెంటర్ చూసినా ఏ రోడ్లు చూసినా ‘ఆవులే’ కనిపిస్తాయి. రోడ్డుమీద అడ్డంగా,డివైడర్ల మీద,షాపింగ్ కాంప్లెక్సుల ముందు ఇలా ఎక్కడ చూసినా మందలు, మందలుగా ఆవులు తిరుగుతూ పట్టణంలో నిరంతరం ట్రాఫిక్ కు అంతరాయం కలిస్తున్నాయి.

యజమానుల బేఖాతరు-పట్టణ ప్రజల బేజారు

గతంలో పలుమార్లు పలు పత్రికల్లో సామాజిక మాధ్యమాల్లో  ఆవులు నిత్యం రోడ్లమీద సంచారం చేస్తున్న వార్తలు రావడంతో మునిసిపల్ కమీషనర్ మల్లికార్జున ఆవుల యజమానులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది.బేఖాతరు చేసిన యజమానులకు నోటీసులు జారీ చేయడం, జరిమానాలు విధించడం, ఆవులను మునిసిపల్ అధికారులు సంభదిత స్థలంలో ఉంచడం కూడా జరిగింది.

షరామామూలే

ఇంత జరిగినా తిరిగి ఆవుల యజమానులు వాటిని రోడ్లపై వదిలేసి చేతులు దులుపుకుంటున్నారు.అవి గుంపులుగా తిరుగుతూ బెదరి పరిగెత్తడం, పొట్లాడుకోవడం, రోడ్లపై అడ్డదిడ్డంగా రావడం వల్ల పాదచారులు, వాహన చోదకులు గాయపడ్డ సంఘటనలు కూడా ఉన్నాయని, ఇలాగే ఆవుల్ని వదిలేస్తే  దురదృష్టవశాత్తూ ఏవైనా ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా పట్టణంలో ‘ఆవుల సంచారం పై’వాటిని నిర్లక్ష్యం రోడ్లపై వదిలేసిన వాటి యజమానులపై కఠినమైన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు

.

Back to top button