
మోడల్ స్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు రక్షణ కల్పించాలి – ఆర్ ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీంద్ర.
మోడల్ స్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు రక్షణ కల్పించాలి – ఆర్ ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీంద్ర.
పాణ్యం (పల్లెవేలుగు) 31 జనవరి: సుగాలి మెట్ట సమీపంలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్లో విద్యార్థులకు రక్షణ కరువైందని, పలు సమస్యలతో విద్యార్థులు సతమతమవుతున్న సిబ్బంది, హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విద్యార్థులకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని రాయలసీమ రవీంద్ర, రాయలసీమ స్టూడెంట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వెంకట్లు తెలిపారు. మంగళవారం విద్యార్థి సంఘం నాయకులు మోడల్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం లో మాట్లాడుతూ సమస్యలపై చర్చించారు. అందుకు విద్యార్థులు తమ మాటలను రాత రూపంలో రాసి విద్యార్థి సంఘం నాయ కులకు. అందజేశారు. ఈ రాత పత్రాలను తీసుకొని వెళ్లి విద్యార్థి సంఘ నాయకులు నంద్యాల జిల్లా విద్యాధికారికి వినతిపత్రం ద్వారా ఆయా రాత పత్రాలను కూడా అందజేశారు. అనంతరం విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ మోడల్ స్కూల్ విద్యార్థులకు అనుసంధానంగా బాలిక 9, 10, ఇంటర్మీడి యట్ తరగతుల వారికి హాస్టల్ వసతి ఏర్పాటు చేశారు. అందులో మెనూ ఇష్టాను సారంగా నిర్వహిస్తున్నా రని, రెట్టింపు బిల్లులతో ఖర్చులు రాసుకుంటు వాట్సాప్ లో నిమగ్నమై ఉంటారని, ప్రిన్సిపల్ విద్యార్థినిల పట్ల వెకిలి చేష్టలు చేస్తూ, అసభ్యకరమైన పదాలు వాడుతూ విద్యార్థినీలకు అభద్రతాభావాన్ని కల్పిస్తున్నారని తెలిపారు. పాఠశాలలకు హాస్టల్లో ఉండే విద్యార్థినీ విద్యార్థులకు రక్షణ లేదంటూ బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్న సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్విఎఫ్ జిల్లా కార్యదర్శి రియాజ్, మండల నాయకులు బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.