
మొక్కలను నాటి వాటిని సంరక్షించడం ద్వారానే పర్యావరణాన్ని కాపాడగలం
మొక్కలను నాటి వాటిని సంరక్షించడం ద్వారానే పర్యావరణాన్ని కాపాడగలం
కర్నూలు (పల్లెవేలుగు) 15 డిసెంబర్: మొక్కలను నాటి వాటిని సంరక్షించడం ద్వారానే పర్యావరణాన్ని కాపాడగలమని ఉస్మానియా కళాశాల కార్యదర్శి మరియు కరస్పాండెంట్ అజ్రా జావేద్ అన్నారు. నేడు ఉస్మానియా కళాశాలలో, బోర్డ్ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ త్రూ ఎడ్యుకేషన్ (BCDE) ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఉస్మానియా కళాశాల క్యాంపస్ పరిసరాలలో దాదాపు 50 మొక్కలను నాటి వాటికి సంరక్షణ ఏర్పాటు చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ సయ్యద్ సమీవుద్దీన్ ముజమ్మిల్ మాట్లాడుతూ ప్రతి మొక్కను జియో టాకింగ్ చేసి మొక్కను నాటిన విద్యార్థి దాని సంరక్షణను చూడాల్సిన బాధ్యత తీసుకోవాలని అన్నారు BCDE, కో – ఆర్డినేటర్ షేక్ రసూల్ నేతృత్వంలో కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఉస్మానియా కళాశాల ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్. మం.డి అన్వర్ హుస్సేన్, ఎన్సిసి అధికారి లెఫ్టినెంట్ గౌస్ పీరా,NSS అధికారులు ఏ.ఆబిద్ అలీ, ఎం.ఉబేదుల్లా షరీఫ్, అధ్యాపకులు ,విద్యార్థులు పాల్గొన్నారు.