nandyala

మైనార్టీ విద్యార్థులకు ప్రి మెట్రిక్  స్కాలర్షిప్ రద్దు దారుణం – ఆల్ మేవ

మైనార్టీ విద్యార్థులకు ప్రి మెట్రిక్  స్కాలర్షిప్ రద్దు దారుణం – ఆల్ మేవ

నంద్యాల (పల్లెవేలుగు) 01 డిసెంబర్:  1వ తరగతి నుండి 8వ తరగతి వరకు చదివే మైనారిటీ విద్యార్థులకు అందించే ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ లను కేంద్ర ప్రభుత్వం  రద్దు చేయటం దుర్మార్గం అని All MEWA – ఆల్ మైనారిటీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ నంద్యాల డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సయ్యద్ ఇమ్రాన్ పాష మాట్లాడుతూ ఇప్పటికే  మైనారిటీ వర్గ ప్రజలు ఉపాధి లేక వచ్చే కొద్దిపాటి స్కాలర్ షిప్లతో చదువులు సాగిస్తున్న మైనారిటీ విద్యార్థుల కు ఆ చదువులు కూడ అందకూడదనే దురాలోచనతో కేంద్ర ప్రభుత్వం  మైనారిటీ విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ రద్దు చేసింది. ప్రస్తుత బిజేపి ప్రభుత్వం మైనారిటీ వర్గాలకు ఉపాధి, విద్య అందకుండా చేస్తోంది. దీంతో చాలా మంది నిరుపేద మైనారిటీ విద్యార్థులు చదువులకు దూరం అయ్యే ప్రమాదం ఏర్పడుతుంది. ఇలాంటి దుశ్చర్యలను తీవ్రంగా ప్రతిఘటించాలని All MEWA తరపున అందరిని కోరారు. ఇప్పటికే స్కాలర్ షిప్ ల కోసం దరఖాస్తు చేసుకొని పాఠశాల ద్వారా ఫార్వర్డ్ చేసిన దరఖాస్తులను రద్దు చేయటం తీవ్ర ఆక్షేపనీయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్మేవ రాష్ట్ర గౌరవ సలహాదారు అబులైస్, నంద్యాల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఇమ్రాన్ పాష, ముహమ్మద్ సలీం మరియు కార్యకర్తలు నబి రసూల్, ఫైరోజ్ షా సిద్ధిఖి, కలీం, ఫైజుల్ల మొదలగు వారు పాల్గొన్నారు

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button