nandyala

మూల మఠం లో కార్తీకమాస వనబోజనాలు.

  • మూల మఠం లో కార్తీకమాస వనబోజనాలు.
  • బాలాజీ కాంప్లెక్స్ ఆర్యవైశ్యులు కుటుంబసభ్యులతో పాల్గొనండి.
  • అలరించనున్న సాంసృతిక కార్యక్రమాలు.

నంద్యాల నవంబర్ 11 (పల్లెవేలుగు) పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకుని ఆదివారం మూల మఠం లో బాలాజీ కాంప్లెక్స్ లోని ఆర్యవైశ్యులు కుటుంబసభ్యులతో కార్తీక మాస వన భోజనాలకు హాజరు కావాలని బాలాజీ కాంప్లెక్స్ ఆర్యవైశ్య సేవాసమితి అధ్యక్షకార్యదర్శులు బింగుమళ్ల శ్యామ్ సుందర్ గుప్తా,కౌన్సిలర్ కండే వెంకట శ్యామ్ సుందర్ లాల్ లు కోరారు. బాలాజీ కాంప్లెక్స్ లోని కశెట్టి కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వనభోజనాలకు ముఖ్య అతిధులుగా కాణిపాకం దేవస్థానం ధర్మకర్త,ఆర్యవైశ్య మహా సభ అదనపు కార్యదర్శి మువ్వా నరసింహులు శెట్టి,ఉమ్మడి జిల్లాల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వీరబొమ్మ నాగ సత్యనారాయణ, ఆంద్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఉపాదక్షులు పత్తి ప్రసాద్,బలసా వేణుగోపాల్,ఆంద్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాయలసీమ పొలిటికల్ చైర్మన్, వంకదారి వెంకటేష్ పాల్గొంటారని అన్నారు.కార్తీక మాసాన్ని పురస్కరించుకుని గత 8 ఏళ్లుగా కార్తీక మాస వనభోజనాలను ఏర్పాటుచేస్తున్నామని అన్నారు.ఈ ఏడాది బాలాజీ కాంప్లెక్స్ ఆర్యవైశ్యులు అందరూ కుటుంబసభ్యులతో హాజరు కావాలని కోరారు.పూర్వ కాలం నుంచి పెద్దలు కార్తీక మాసంలో ఉసిరిక చెట్టు క్రింద సామూహికంగా భోజనాలు చేసేవారన్నారు. ఉమ్మడి కుటుంబాలు అప్పట్లో అధికం ఉండడంవల్ల వనబోజనాలు సందడిగా వుండేవన్నారు. వనభోజనాలకు వచ్చేవారి కోసం కర్నూల్ కు చెందిన కె.ఎం.ఆర్ మ్యూజిక్ ఎంటర్ టైనర్స్ రేఖ,సురేష్ ల తో సాంసృతిక కార్యక్రమాలు, ఎన్జీఓ కాలనీ శ్రీ సాయి నాట్యంజలి  పళ్లెం శెట్టి సురేష్ గురువు గారి అద్వర్యం లో భరతనాట్యం, కూచిపూడి నాట్యాలు నిర్వహిస్తున్నామని అన్నారు.ఇవే కాకుండా మహిళా మండలి వారిచే కోలాటం,చిన్న పిల్లలకు ప్రత్యేక ఆటలు,మహిళలకు ప్రత్యేక ఆటలు,మ్యాజిక్ షో,క్లాసికల్ డ్యాన్స్,మాడరన్ డ్యాన్స్ తో పాటు పురుషులకు ప్రత్యేక ఆటలు ఉంటాయని అన్నారు.కార్తీక వనభోజనాల సందర్భంగా ఏర్పాటుచేసిన అన్ని సాంసృతిక కార్యక్రమాల్లో విజేతలకు భవనాశి జూవెలర్స్ బహుమతులు అందిస్తారని అన్నారు.ఈ కాయక్రమంలో కశెట్టి చంద్రశేఖర్,కంభం శ్రీనివాసులు,దేసు గురుచరన దాసు గుప్తా, మిరియాల చంద్రమౌళి,లగిశెట్టి నవీన్ కుమార్,కూరాకు కృష్ణ మూర్తి,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button