
మూడవ విడత వై.యస్.అర్.చేయూతను ప్రారంభించిన రాష్ట్ర మండలి ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర రెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగంగుల బ్రిజేoద్రారెడ్డిలు
మూడవ విడత వై.యస్.అర్.చేయూతను ప్రారంభించిన రాష్ట్ర మండలి ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర రెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగంగుల బ్రిజేoద్రారెడ్డిలు
ఆళ్లగడ్డ (పల్లెవెలుగు) సెప్టెంబర్23: ఆళ్లగడ్డ పట్టణము లోని మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణములో శుక్రవారం నాడు వై.యస్ అర్ చేయూత మూడవ విడత చెక్కులను రాష్ట్ర శాసనమండలి ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర రెడ్డీ, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంధ్రారెడ్డిలు ప్రారంభించారు. ఆళ్లగడ్డ మండలానికి 7 కోట్ల 26లక్షల, ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలో 3కోట్ల 46 లక్షల 50 వేల రూపాయల చెక్కులనువారు పంపిణీ చేశారు. మొదట సియం. జగన్ మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భముగా రాష్ట్ర శాసనమండలి ప్రభుత్వ విప్ గంగులప్రభాకర రెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేoద్రారెడ్డిలు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా పేదలకు, రైతులకు, మహిళల సంక్షేమం కోసం అనేక రకాల పథకాలకు శ్రీకారం చుట్టి అమలు చేస్తున్నఘనత ముఖ్యమంత్రి వై.యస్ జగన్ కే దక్కుతుందని గుర్తు చేశారు. రాష్ట్రములో జరుగుచున్న అభివృద్ధిని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక ప్రతి పక్షాలు విమర్శలు చేస్తున్నాయని వారు ప్రతి పక్షలపై నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, వారి విమర్శలను అన్నింటినీ వారుత్రిప్పి కొట్టారు. రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్ కు అండగా ఉన్నారని , ప్రతిపక్ష నాయకుల చేసే విమర్శలను ప్రజలు నమ్మరని, వారు ప్రజలలో తమ ఉనికిని కాపాడు కోవటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని రాష్ట్ర శాసన మండలి ప్రభుత్వ విప్ గంగులప్రభాకర రెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డిలు తీవ్రoగాదుయ్య పట్టారు. ఈ కార్యక్రమములో ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్మన్ డా.కె.రామ లింగారెడ్డి, వైస్ చైర్మన్ లు నాయుబ్ రసూల్, మరియమ్మమున్సిపల్ కౌన్సిలర్లు గొట్లూరుసుధాకరరెడ్డి, బద్రి సుధామణి, వరలక్ష్మీ, ఆళ్లగడ్డ మున్సిపల్కమీషనర్ ఏవి రమేష్ బాబు, ఆళ్లగడ్డ తహాశిల్దార్ హరినాథ్ రావు, ఆళ్లగడ్డ యంపి డి. ఓపి.వి సుబ్బారెడ్డి, మున్సిపల్ అధికారులు, వెలుగు సిబ్బంది, ఆళ్లగడ్డమార్కెట్ వైస్ చైర్మన్ నరసింహా రెడ్డి, వైకాపా నాయకులు బద్రి సుధాకర్ రెడ్డి,సింగం వెంకటేశ్వర రెడ్డి, సింగం భరత్ కుమార్ రెడ్డి, శివనాగిరెడ్డి, గంగుల రామిరెడ్డి, గూబగుండం వెంకట సుబ్బారెడ్డి నజీర్, ఆళ్లగడ్డ ఉప మండలాధ్యక్షులునాసారీ వెంకట ప్రసాద్, వై.యస్ సిపి కార్యకర్తలు, గంగుల అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గోన్నారు.