
ముస్లీం మైనార్టీల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
ముస్లీం మైనార్టీల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
నంద్యాల (పల్లెవెలుగు) 24 సెప్టెంబర్: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ ముస్లిం మైనారిటీ సమస్యల పై “ఏక్ మౌక బార్ బార్ ధోక” అనే నినాదం తో 6వ రోజు పాదయాత్ర నిర్వహించారు. నంద్యాల జిల్లా అయ్యలూరు చాగోలు గ్రామాల్లో పాదయాత్ర చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహమ్మద్ మౌలానా ముస్తాక్ అహమ్మద్ మాట్లాడుతూ ఎన్నికల ముందు జగన్మోహన్రెడ్డి ముస్లీంలకు ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన తరువాత విస్మరించి ఇప్పటి వరకు నెరవేర్చకపోవడం దారుణమని అన్నారు. మైనార్టిలకు కేటాయించిన నిధులను సబ్ ప్లాన్ ప్రకారం అమలు చే యాలన్నారు. పోవాలి జగన్ కావాలి బాబు అని రాష్ట్ర ముస్లిం మైనార్టీలు, ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని తెలిపారు.