
ముగిసిన దసరా శరన్నవ రాత్రి మహోత్సవ వేడుకలు
ముగిసిన దసరా శరన్నవ రాత్రి మహోత్సవ వేడుకలు
ధర్మవరం (పల్లెవెలుగు) అక్టోబర్ 8 : పట్టణంలోని కెపిటి వీధిలో గల వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో సెప్టెంబర్ 26వ తేదీ నుండి అక్టోబర్ 8వ తేదీ వరకు 13 రోజులు పాటు ఆర్యవైశ్య సంఘము వాటి అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా విజయవంతంగా నిర్వహించారు. ఇందులో భాగంగా చివరి రోజు శనివారం వాసవి దేవాలయంలో వాసవి మాతకు ప్రత్యేక పూజలు, అభిషేకము, సంప్రోక్షణ ను అర్చకులు నారాయణమూర్తి చంద్రశేఖర్ శర్మలు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించారు. వాసవి మాతను ప్రత్యేకంగా అలంకరించిన దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం వాసవి మహిళా మండలి కార్యదర్శి కాకుమాని కళ్యాణి, కోశాధికారి నల్లపేట మంజు సంయుక్త, ప్రోగ్రాం ఆర్గనైజర్ కలవల శ్రీదేవితో పాటు ఉపాధ్యక్షులు, సహకార దర్శులు, సహా కోశాధికారులు, డైరెక్టర్లు పాల్గొని భక్తాదులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి అనంతరం 20 మంది ఆర్యవైశ్య మహిళలు వాసవి పారాయణమును నిర్వహించారు. తీర్థ ప్రసాదాలతో ఈ వేడుకలు ముగిశాయి. ఈ దసరా శరన్నవ రాత్రి మహోత్సవ వేడుకలకు ఆర్య వైశ్యులు, ఆర్యవైశ్య సంఘం వాటి అనుబంధ సంస్థలు ప్రతినిధులు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయ సహకారాలు అందించి, విజయవంతం చేసిన వారందరికీ పేరుపేరునా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కలవల మురళీధర్, కార్యదర్శి బిమిశెట్టి కృష్ణమూర్తి, కోశాధికారి ఓ. వి. ప్రసాద్, దేవాలయ కమిటీ చైర్మన్ తబ్జులు తిమ్మయ్య, వైస్ చైర్మన్ భూశెట్టి రామకృష్ణ లు కృతజ్ఞతలను తెలియజేశారు.