Dharmavaram

మీరు చేసే రక్తదానం ఎంతో మందికి ప్రాణదానం అవుతుంది.

మీరు చేసే రక్తదానం ఎంతో మందికి ప్రాణదానం అవుతుంది.

దేవనకొండ (ఆంధ్ర ప్రతిభ) రక్త దానం చేసి ప్రాణ దాతలు కావాలని దేవనకొండ యువకులు వీరేష్ మధుసూదన్ సాయికుమార్ చిదంబర గౌడ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని నిర్వహించిన రక్తదాన  శిబిరాన్ని వారు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ప్రతిరోజూ రక్తం అవసరం ఉండి ఎంతోమంది ఇబ్బందులకు గురౌతున్నారని, తలసేమియా వారు రక్తం కోసం పాట్లు పడుతున్నారన్నారు. రక్తదానం చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు.ప్రతి రక్తపు బొట్టు విలువైనదని, ఏదైనా పునరుత్పత్తి చేసుకోవచ్చు గానీ రక్తాన్ని మాత్రం ఎవరో ఒకరు దానం చేయడం వల్లే పొందవచ్చన్నారు. రక్త దానంపై అపోహలు వీడాలన్నారు. ఎవరికైనా బ్లడ్ కావాలంటే ఈ నెంబర్లకి 9885329634,9885656121 ఫోన్ చేయాల్సిందిగా వారు కోరారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.

Back to top button