nandyala

మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీలలో నంద్యాల న్యూ బాడీ లైన్ జిమ్ విద్యార్థులు సాధించిన పతకాలు

మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీలలో నంద్యాల న్యూ బాడీ లైన్ జిమ్ విద్యార్థులు సాధించిన పతకాలు

నంద్యాల (ఆంధ్రప్రతిభ) 27 సెప్టెంబర్: ఈ నెల 25వ తేదీన ఆదివారం కడప పట్టణంలో బాయ్స్ ఎంపీపీ ఉర్దూ హై స్కూల్ నందు  న్యూ ఆంధ్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి 7th మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీల్లో నంద్యాల న్యూ బాడీ లైన్ జిమ్ లో కోచ్ ఖాజా మొహిద్దిన్ దగ్గర  శిక్షణ  తీసుకుంటున్న విద్యార్థులు బి. సాద్విక్ రెడ్డి మెన్స్ ఫిజిక్ పోటీల్లో ప్రథమ బహమతి, 55 కేజీల కేటగిరిలో బాడీ బిల్డింగ్ పోటీల్లో ప్రథమ బహుమతి తోపాటు బంగారు పతాకాలు కూడా సాధించారు మరియు 85 కేజీల కేటగిరిలో బాడీ బిల్డింగ్ పోటీల్లో షేక్. హబిబుల్లహ్ తృతీయ స్థానం మరియు 60 కేజీల బాడీ బిల్డింగ్ కేటగిరిలో  షేక్.అరిఫ్ నాల్గవ స్థానం మరియు 65 కేజీ బాడీ బిల్డింగ్ కేటగిరిలో కే.చైతన్య నాల్గవ స్థానం సాధించడం జరిగింది. ఈ సందర్భంగా జిమ్ కోచ్ అయిన ఖాజా మొహిద్దిన్ పతకాలు సాధించిన విద్యార్థులను అభినందించడం జరిగింది.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button