Vizianagaram

మిల్లి కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ విధ్యదినోత్సవం

మిల్లి కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ విధ్యదినోత్సవం

బొబ్బిలి (పల్లెవెలుగు) 12 సెప్టెంబర్ : అంత ర్జాతీయ విద్యాదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక షాదీఖానాలో ఆదివారం జామియా మసీదు అధ్యక్షడు అబ్దుల్ కలాం అధ్యక్షతన విధ్యదినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిధీగా అల్ ఇండియా మిల్లి కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి మౌలానా అబ్దుల్ కదీర్ నిజామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దేశానికి మొదటి విద్యామంత్రి మౌలానా అబ్దుల్ కలాం అజాద్ అయినప్పటికీ ముస్లింలంతా విద్యలో వెనుకబడి ఉండడం దురదృష్టకరమని హైస్కూలు స్థాయిలో ఉర్దూను ప్రోత్సహించాలని, బీసీ-ఈ కేటగిరీలో రిజర్వేషన్ కల్పించాలని కోరారు. ముస్లింలంతా ఐకమత్యంగా ఉంటూ దేశ సమగ్రత, సౌభ్రాతృత్వం కలిగి ఉండాలని ఓటు హక్కు, రాజ్యాంగాలపై, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. 2025 నాటికి శతశాతం అక్షరాస్యత సాధించేలా అల్ ఇండియా మిల్లి కౌన్సిల్ ప్రతి సభ్యుడు కృషి చేయాలనీ పిలుపునిచ్చారు. అనంతరం ముఖ్య అతిధులకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జామియా మసీదు అధ్యక్షుడు హజీ పీరా, హుదా అధ్యక్షుడు మహమ్మద్ ఖాన్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు రియాజ్ ఖాన్, హమీద్ తదితరులు పాల్గొన్నారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button